తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​షిప్​: సెమీస్​లోకి సింధు - భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు

ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు అమ్మాయి పి.వి.సింధు సెమీస్​ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్​ మ్యాచ్​లో రెండో సీడ్‌, చైనీస్‌ తైపీ క్రీడాకారిణి  తై జు యింగ్‌పై విజయం సాధించింది.

ప్రపంచ ఛాంపియన్​షిప్​: సెమీస్​లో అడుగుపెట్టిన సింధు

By

Published : Aug 23, 2019, 6:31 PM IST

Updated : Sep 28, 2019, 12:35 AM IST

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు పతకాలు కొల్లగొట్టిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌లో ఆమె సెమీస్​లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ... 12-21, 23-21, 21-19 తేడాతో రెండో సీడ్‌ తై జు యింగ్‌(చైనీస్‌ తైపీ)పై గెలిచింది సింధు. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు తెలుగు అమ్మాయి ఆధిపత్యం ప్రదర్శించింది.

మ్యాచ్​ పాయింట్లు

తొలి సెట్​లో దాదాపు 9 పాయింట్ల తేడాతో ఓడిపోయిన సింధు... రెండు, మూడు సెట్లలో మాజీ ప్రపంచ నెం.1కు తిరుగులేని పోటీ ఇచ్చింది.

మరో మ్యాచ్​లో సాయి ప్రణీత్​ సెమీఫైనల్ బెర్తు కోసం జోనాతన్​ క్రిస్టీ(ఇండోనేషియా)తో తలపడనున్నాడు.

Last Updated : Sep 28, 2019, 12:35 AM IST

ABOUT THE AUTHOR

...view details