ప్రీ క్వార్టర్లో శ్రుతి ముండాడాతో జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేసుకుంది. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ ముందు ఈ కోర్టులో ఆడి రిస్క్ తీసుకోలేనని సైనా తెలిపింది.
ఇదే కోర్టులో ఉదయం సింధు మ్యాచ్ ఆడింది. ప్రీ క్వార్టర్లో మాళవిక బాన్సోడ్పై గెలుపొందింది.

"సింధు ఆడిన తర్వాత అక్కడక్కడ చెక్క పెచ్చులుగా ఉడి బయటకు వచ్చింది. దాన్ని వారు సరిచేస్తున్నారు. సాయంత్రం మేం ఆడతామని " పురుషులు సింగిల్స్ క్రీడాకారుడు కశ్యప్ తెలిపాడు.
"భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బాయ్) అధికారులు సమస్యను గుర్తించారు. సైనా, కశ్యప్, సాయి ప్రణీత్‌లు సాయంత్రం జరిగే మ్యాచ్‌లు ఆడతారని" నిర్వాహకుడు ఒమర్ రషీద్ తెలిపారు.
"కొన్ని ప్రదేశాల్లో కోర్డు ఆటకు వీల్లేని విధంగా తయారైంది. బాయ్ దాన్ని సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతవరకు మ్యాచ్‌లన్నీ తరుణ్ రామ్ పోకన్ ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని" రషీద్ చెప్పారు.
అసోం బ్యాడ్మింటన్ అకాడమీలోని మూడు కోర్టుల్లో ఈ ఛాంపియన్షిప్ జరుగుతోంది.