తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్రెంచ్ ఓపెన్​లో సింధు శుభారంభం - pv sindhu 2nd round

పారిస్ వేదికగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్​ తొలి రౌండ్​లో గెలిచింది పీవీ సింధు. కెనడాకు చెందిన మిచెలి లీపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది.

ఫ్రెంచ్ ఓపెన్​లో సింధు శుభారంభం

By

Published : Oct 23, 2019, 7:41 AM IST

ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు ఫ్రెంచ్‌ ఓపెన్లో శుభారంభం చేసింది. మంగళవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆమె మిచెలి లీ (కెనడా)పై విజయం సాధించింది. సింధు రెండో రౌండ్లో సింగపూర్‌కు చెందిన యో జియా మిన్‌తో తలపడనుంది.

21-15, 21-13 తేడాతో ప్రత్యర్థిపై వరుస సెట్లలో నెగ్గింది సింధు. ఆద్యంతం ఆధిపత్యం చెలాయించి మిచెలికి అవకాశమివ్వలేదు.

ఆగస్టులో ప్రపంచ టైటిల్‌ గెలిచిన తర్వాత ఆడిన మూడు టోర్నీల్లో సింధు రెండో రౌండ్‌ దాటలేకపోయిన సంగతి తెలిసిందే.

పురుషుల సింగిల్స్‌లో శుభాంకర్‌ డే రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మొదటి రౌండ్లో అతడు 15-21, 21-14, 21-17తో ప్రపంచ 17వ ర్యాంకు ఆటగాడు సుగియార్తో (ఇండోనేసియా)కు షాకిచ్చాడు. శుభాంకర్‌ది 42వ ర్యాంకు.

ఇదీ చదవండి: బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా నేడే గంగూలీ పదవీ స్వీకారం!

ABOUT THE AUTHOR

...view details