భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నాడు సౌరభ్ గంగూలీ. ముంబయిలో జరగనున్న బోర్డు వార్షిక సాధారణ సమావేశంలో దాదా పగ్గాలు అందుకోనున్నాడు. దీని ఫలితంగా 33 నెలలుగా బీసీసీఐ పాలనా వ్యవహారాలు చూసేందుకు సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ(సీవోఏ) హయాం ముగిసిపోనుంది.
గంగూలీ ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దాదాతో పాటు ఉపాధ్యక్షుడిగా ఉత్తరాఖండ్‌కు చెందిన మహిం వర్మ, కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా, కోశాధికారిగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ దుమాల్, సంయుక్త కార్యదర్శిగా కేరళకు చెందిన జయేష్ జార్జి బాధ్యతలు స్వీకరించనున్నారు.
-
The new team at. @bcci .. hopefully we can work well .. anurag thakur thank you for seeing this through @ianuragthakur pic.twitter.com/xvZyiczcGq
— Sourav Ganguly (@SGanguly99) October 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The new team at. @bcci .. hopefully we can work well .. anurag thakur thank you for seeing this through @ianuragthakur pic.twitter.com/xvZyiczcGq
— Sourav Ganguly (@SGanguly99) October 14, 2019The new team at. @bcci .. hopefully we can work well .. anurag thakur thank you for seeing this through @ianuragthakur pic.twitter.com/xvZyiczcGq
— Sourav Ganguly (@SGanguly99) October 14, 2019
రెండో వ్యక్తిగా...
బీసీసీఐ అత్యున్నత పదవి అధిరోహించిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాడు దాదా. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ విజయనగరానికి చెందిన మాజీ ఆటగాడు పూసపాటి ఆనంద గజపతిరాజు (విజ్జీ) బీసీసీఐ అధ్యక్షుడిగా(1954-56) బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన తర్వాత సునీల్ గావస్కర్, శివలాల్ యాదవ్ ఈ పదవిలో సేవలందించారు. అయితే వారు పూర్తి కాలం బాధ్యతలు నిర్వర్తించలేదు. 2014లో మధ్యంతర కాలానికి పనిచేశారు. కానీ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా పూర్తి కాలానికి బాధ్యతలు చేపట్టనున్నాడు.
గంగూలీ గురించి ఈ విషయాలు తెలుసా..!
తన కెప్టెన్సీతో భారత క్రికెట్ రూపురేఖలు మార్చిన సారథుల్లో సౌరవ్ గంగూలీ ముందు వరుసలో ఉంటాడు. విదేశాల్లో టీమిండియా సత్తాచాటడానికి దోహదపడ్డాడు. విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు భారత క్రికెట్‌ను నియంత్రించే బీసీసీఐ అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యాడు.
- గంగూలీకి 'ప్రిన్స్ ఆఫ్ కలకత్తా' అనే బిరుదు ఇచ్చాడు మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్. కానీ అంతకంటే ముందే దాదా తండ్రి అతడికి 'మహరాజ్' అనే ముద్దుపేరు పెట్టాడు.
- 1992లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గంగూలీ.. ఈ మ్యాచ్‌లో మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం నాలుగేళ్ల పాటు అతడికి ఉద్వాసన పలికింది యాజమాన్యం. ఆటగాళ్లకు డ్రింక్స్ పట్టుకురావడాన్ని నిరాకరించడం వల్ల అతడి ప్రవర్తన బాగా లేదని జట్టు నుంచి తొలగించారనే పుకార్లూ ఉన్నాయి.
- జట్టుకు దూరమైన సౌరవ్.. ఓ బౌలింగ్ వేసే యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంటివద్దే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు.
- నాలుగేళ్ల తర్వాత ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో టెస్టు అరంగేట్రం (1996) చేశాడు దాదా. అదే మ్యాచ్‌లో సెంచరీ (131)తో అదరగొట్టాడు. కెరీర్లో అక్కడ తొలి టెస్టు మ్యాచ్ ఆడుతూ అత్యధిక స్కోర్ చేసిన వారిలో ఇప్పటికీ గంగూలీదే రికార్డు.
- 2003 ప్రపంచకప్‌లో సెంచరీ చేయడం ద్వారా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
- టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌గా గంగూలీ పేరిటే రికార్డు ఉంది. రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టు) కలిపి మొత్తం 18,433 పరుగులు చేశాడీ క్రికెటర్. (టెస్టుల్లో 7,212.. వన్డేల్లో 11,221)
- అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ రికార్డు గంగూలీ పేరిటే ఉంది. వన్డేల్లో 22, టెస్టుల్లో 16 చేశాడు.
- గంగూలీ ఒకసారి (1996) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.
- వన్డేల్లో 10 వేల పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు పట్టిన ఐదుగురు క్రికెటర్లలో గంగూలీ ఒకడు. సచిన్, సనత్ జయసూర్య, కలిస్, దిల్షాన్ అతడి కంటే ముందున్నారు.
- గంగూలీ శతకం చేసిన ఏ టెస్టు మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోలేదు.
మొదటి కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఉన్న గంగూలీ.. సోదరుడి కిట్ వాడటం కోసం ఎడమచేతి వాటంకు మారాడు. గంగూలీకి భక్తి ఎక్కువ. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం అలవాటు