తెలంగాణ

telangana

By

Published : Mar 10, 2019, 6:05 PM IST

ETV Bharat / sports

ఆరుగురిలో పసిడి పంచ్​ ఎవరిది.?

భారతీయ బాక్సర్లు శివథాపా, హుస్సాముద్దీన్​ ఫిన్లాండ్​లో జరుగుతున్న జీబీ బాక్సింగ్​ టోర్నీ ఫైనల్​ రింగ్​లోకి ప్రవేశించారు. వీరిద్దరితో పాటు మరో నలుగురు ఆటగాళ్లు తుదిపోరుకు అర్హత సాధించారు.

ఆరుగురిలో పసిడి పంచ్​ ఎవరిది.?

భారత అగ్రశ్రేణి బాక్సర్‌ శివ థాపా (60 కేజీలు) విభాగంలో రష్యా ఆటగాడు మైఖేల్​ వార్లమోవ్​ను 5-0తో ఓడించాడు. ప్రత్యర్థి ఆసియా గేమ్స్​లో మూడు సార్లు పసిడి విజేతవడం విశేషం.

  • కజకిస్థాన్​కు చెందిన జన్‌బొలాత్‌ను పంచ్​తో పడగొట్టిన తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్​.. ఫైనల్​ బరిలో నిలిచాడు. తుది మ్యాచ్​లో ఫ్రెంచ్​ ఆటగాడు జోర్డాన్​తో తలపడనున్నాడు.

ఇండియా ఓపెన్​ బంగారు పతక విజేత​ దినేశ్​ ​(69కేజీలు) రష్యా ఆటగాడు సోబిలిన్​స్కీ ని బెంబేలెత్తించాడు. తదుపరి మ్యాచ్​లో కామన్వెల్త్​​ పసిడి విజేత మెక్​కార్మా​క్​(ఇంగ్లాండ్​)ను ఎదుర్కోనున్నాడు.

నవీన్​ కుమార్​(ప్లస్​ 91 కేజీలు) విభాగం ఫైనల్లో ఇంగ్లండ్​ ఆటగాడు ఫ్లేజర్​తో పోటీపడనున్నాడు. గోవింద్ సహానీ​ (49 కేజీలు) తుది పోరులో థాయ్​లాండ్​ ఆటగాడు పన్​మోద్​తో టైటిల్​ పోరుకు రెఢీ అయ్యాడు.

  • కవిందర్ సింగ్ 56కేజీల విభాగంలో పసిడికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు.

బంగారు పతకం తెస్తారనుకున్న సుమిత్​(91 కేజీలు), మాజీ ఛాంపియన్​ సచిన్​ ​(52 కేజీలు) సెమీఫైనల్లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నారు.


ABOUT THE AUTHOR

...view details