దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత టోక్యో డిస్నీల్యాండ్ తెరుచుకుంది. అయితే 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కవ ఉన్న, ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించినా ఇక్కడికి రావొద్దని సంస్థ ప్రతినిధులు సూచించారు. దీనితో పాటే సందర్శకులకు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ డిస్నీల్యాండ్లోని ప్రఖ్యాత షోలు, కవాతుల్ని కొన్నిరోజులపాటు నిలిపివేస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. అయితే డిస్నీ పాత్రలు మాత్రం రోజులో కొన్నిసార్లు కనువిందు చేస్తూ ఉంటాయి. టికెట్లను ఆన్లైన్లో మాత్రమే విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ 12 గంటలు మాత్రమే 'డిస్నీల్యాండ్' పనిచేస్తుందని చెప్పారు.