టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా.. నటిగానే కాకుండా గాయనిగానూ సత్తా చాటింది. 'జోరు' సినిమాతో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అభిమానుల్ని అలరించింది. ఇటీవలే 'ప్రతిరోజూ పండగే'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఇంటర్య్వూలోని ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఇంతకీ ఏమైంది?
ఇంటర్వ్యూ మధ్య ఖాళీ సమయంలో రాశీఖన్నా.. 'ఏం సందేహం లేదు ఈ తొందర్లు యిచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది' అంటూ పాడుతుండగా, ఆమె పక్కనే ఉన్న హీరో సాయిధరమ్ తేజ్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈ వీడియోను దర్శకుడు మారుతి తీశాడు.
ఈ వీడియోను పోస్ట్ చేసిన రాశీ.. 'సాయిధరమ్ తేజ్ నా గానం విని నిద్రపోయాడు. కానీ మీరు ఈ పాట విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అన్నట్లు మీ హృదయంతో పాడటానికి ఇది మంచి సమయం.. ఇక ఈ వీడియో క్రెడిట్ దర్శకుడు మారుతికే చెందుతుంది' అంటూ రాసుకొచ్చింది.
ఇదీ చదవండి:''ఆర్.ఆర్.ఆర్' సినిమాను భారంగా భావించలేదు'