"ఒక సినిమా ఒప్పుకోవడానికి వంద రకాలుగా ఏమీ ఆలోచించను. మంచి కారణం ఒక్కటి కనిపించినా చాలు, వెంటనే పచ్చజెండా ఊపేస్తా" అంటోంది రకుల్‌ప్రీత్ సింగ్. దక్షిణాదిలో సినిమాలు చేస్తూనే, బాలీవుడ్‌లో కెరీర్‌ని తీర్చిదిద్దుకుందీ నటి. ఎక్కడ మంచి అవకాశం వచ్చినా కాదనకుండా చేస్తూ అన్ని భాషల్లోనూ రాణించే ప్రయత్నం చేస్తోంది.
'ఏ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చెప్పలేం'
"మంచో చెడో ఆ సమయంలో ఏది సరైనదనిపిస్తే దానికే కట్టుబడి ఉంటా" అంటోంది నటి రకుల్ ప్రీత్‌సింగ్. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తోందో ఎవ్వరం ఊహించలేమని తెలిపింది.
వ్యక్తిగతంగా దృఢమైన వ్యక్తిత్వం రకుల్ సొంతం. కెరీర్ పరంగా కూడా చాలాసార్లు అదే ధైర్యంతోనే నిర్ణయాలు తీసుకుంటుంటా అంటోందీ ముద్దుగుమ్మ. "ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో ఎవ్వరం ఊహించలేం. మొదట్లో అన్నీ అనుకూలంగానే కనిపిస్తాయి. ప్రతి కథ కూడా గొప్పగానే అనిపిస్తుంది. కానీ ప్రేక్షకుల ముందుకెళ్లే వరకు దాని భవితవ్యం ఏంటనేది తెలియదు. అందుకే మంచో చెడో ఆ సమయంలో ఏది సరైదనిపిస్తే దానికే కట్టుబడి ఉంటా. చివరికి మనం చేసిన తప్పులు మాత్రం మనకు అర్థమవుతాయి. తదుపరి ప్రయాణంలో వాటిని గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలంతే. నేను కూడా చాలాసార్లు కథల కంటే కూడా.. అందులోని నటుల్ని, దర్శకుల్ని పరిగణలోకి తీసుకొని సినిమాలు చేశా" అని చెప్పుకొచ్చింది రకుల్.
ఇవీ చూడండి.. ఎంఎస్ రాజు 'డర్టీ హరి' ఫస్ట్‌లుక్ ఇదిగో