Mahaan teaser: తమిళ హీరో విక్రమ్ నటించిన కొత్త సినిమా 'మహాన్'. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో విక్రమ్‌తో పాటు ఆయన కుమారుడు ధ్రువ్ ప్రధాన పాత్రలో నటించాడు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ కానుంది.
ఇందులో విక్రమ్.. గాంధీ మహాన్ అనే పాత్రలో కనిపించారు. మద్యం సిండికేట్ నేపథ్య కథతో ఈ సినిమా తీసినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో బాబీ సింహా, సిమ్రన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'సీఎస్ఐ సనాతన్'. దీని ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మిష నారంగ్, నందిని రాయ్ హీరోయిన్లుగా నటించారు. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహించారు.