మామా అల్లుళ్ల నేపథ్యంలో వచ్చి థియేటర్లలో సందడి చేస్తున్నాడు 'వెంకీమామ'. వెంకటేష్, నాగ చైతన్యలతో దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం బంధాల విలువ తెలియజేస్తూ నవ్వులు పూయిస్తుంది. వెంకీ సరసన పాయల్, చైతూకి జోడీగా రాశి ఖన్నా మురిపించారు. హిందీ ఉపాధ్యాయురాలుగా పాయల్ నటన ఆకట్టుకుంటుంది.
పాయల్, రాశి గొడవ నవ్విస్తుంది.. ఎందుకు కట్ చేశారో!
వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'వెంకీమామ'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ మూవీలోని డెలిటెడ్ సీన్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
వెంకీమామ, పాయల్‌ను ఒకటి చేయాలనుకుంటాడు అల్లుడు చైతూ. ఈ విషయం పాపం వెంకీకి తెలియదు. మరోవైపు రాశి, చైతూకి ఒకరంటే ఒకరికి పడదు. ఇలా వాళ్ల మధ్య తెలియకుండానే జరిగే సన్నివేశాలు చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో రాశి తన స్నేహితురాలిని తీసుకుని పాయల్ వద్దకు వెళ్లి గొడవ చేస్తుంది. ఇద్దరి మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. కారణం ఏమో కానీ ఈ కామెడీ సీన్‌ను కట్ చేసింది చిత్రబృందం. తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసి హాయిగా నవ్వుకోండి..
ఇవీ చూడండి.. జనవరి 5న మిమ్మల్ని చూస్తా.. సంక్రాంతికి కలుద్దాం