బాలీవుడ్ గ్లామర్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న వాణీకపూర్ కొత్త దారిలో వెళుతోంది. ఇటీవల ఆమె ట్రాన్స్ గర్ల్ పాత్రలో నటించింది. 'ఛంఢీగడ్ కరే ఆషికీ' చిత్రంలో ట్రాన్స్గర్ల్ మాన్విగా అందరినీ అలరిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమాలో వాణీ పాత్రకు ప్రశంసలు దక్కాయి. భారీ బడ్జెట్‌తో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'షమ్షేరా'లో నాయికగా నటిస్తోంది.
"ఛంఢీగడ్ కరే ఆషికీ', 'షమ్షేరా' చిత్రాల్లో నా నటన చూశాకా నేను ఏ పాత్రైనా పోషించగలను అనే నమ్మకం దర్శకనిర్మాతల్లో కలుగుతుందని బలంగా చెబుతోంది వాణి.
"నా సినిమాల జాబితాలో సాధ్యమైనన్ని వైవిధ్యమైన చిత్రాలు ఉండాలని కోరుకుంటున్నాను. దర్శకనిర్మాతలు నాపై నమ్మకం కలిగి గొప్ప చిత్రాలు తీయడంలో సిద్ధహస్తులైన దర్శకుల సినిమాల్లో భాగం కావాలనుకుంటున్నాను. నేను ఒప్పుకొన్న పాత్ర కోసం వందశాతం కష్టపడతాను. ఒకే మనిషి రకరకాల పాత్రల్లో కనిపించే వరం నటులకు మాత్రమే దక్కుతుంది. ఈ చిన్న జీవితంలో ఎన్నో కొత్త పాత్రల పోషిస్తూ ముందుకెళ్లడానికి కృషి చేస్తున్నాను" అని వాణి చెప్పింది. గతేడాది ఆమె అక్షయ్‌కుమార్‌తో 'బెల్‌బాటమ్' సినిమాతో సందడి చేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: