తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2021, 3:31 PM IST

ETV Bharat / sitara

'ఉప్పెన' టీమ్​కు బన్నీ ప్రశంస.. వైరల్​గా చిరు, చెర్రీ లుక్స్​

'ఉప్పెన' సినిమా అద్భుతంగా ఉందని చిత్రబృందాన్ని ప్రశంసించారు హీరో అల్లు అర్జున్​. 'ఆచార్య' సెట్​లో చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి దిగిన ఫొటోలు వైరల్​ అయ్యాయి.

acharya
ఆచార్య

'ఉప్పెన' చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన హీరో అల్లు అర్జున్​.. చిత్రబృందాన్ని ప్రశంసించారు. బుచ్చిబాబు దర్శకత్వం, వైష్ణవ్​తేజ్​ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు ట్వీట్​ చేసింది మైత్రీ మూవీమేకర్స్​.

'ఆచార్య' సెట్​లో మెగాస్టార్​ చిరంజీవి, హీరో రామ్​ చరణ్ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. అవి మీకోసం..

ఆచార్య చిరు రామ్​ చరణ్​
ఆచార్య చిరు రామ్​ చరణ్​

శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్​ ప్రధాన పాత్రల్లో నటించిన 'గాలిసంపత్'​ సినిమాలోని 'పాప ఓ పాప' పాటను మార్చి 5న ఉదయం 11.07గంటలకు విడుదల చేయనున్నారు హీరో విజయ్ దేవరకొండ. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

గాలి సంపత్​

నాగచైతన్య, సాయిపల్లవి నటించిన 'లవ్​స్టోరీ' సినిమాలోని 'సారంగ దరియా' పాట యూట్యూబ్​లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం 17 మిలియన్ల వ్యూస్​తో పాటు 5లక్షలకుపైగా లైక్స్​ను దక్కించుకుంది.

మరాఠి హారర్​ సినిమా 'బాలీ'ని ఈ ఏడాది ఏప్రిల్​ 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. స్వప్నిల్​ జోషి, పూజా సావంత్​, సామ్రాట్​ జాధవ్​ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు విశాల్​ ఫురియా దర్శకత్వం వహించారు.

బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ రిచాచద్ధా, అలీ ఫజల్​ కొత్త ప్రొడక్షన్​ కంపెనీ 'పుషింగ్​ బటన్​ స్టూడియోస్'​ను ప్రారంభించినట్లు ప్రకటించారు. తమ బ్యానర్​లో 'గర్ల్స్​ విల్​బి గర్ల్స్'​ పేరుతో సినిమాను రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి శుచి తలాటి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఉప్పెన'కు వైష్ణవ్​ రెమ్యునరేషన్​ ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details