తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భారతీయ బైక్​పై టామ్‌క్రూజ్‌ రయ్​రయ్​

సినిమా షూటింగ్‌లన్నీ తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌క్రూజ్‌ సైతం యాక్షన్‌లోకి దిగాడు. యాక్షన్‌ సీక్వెల్స్‌ను బాగా ఇష్టపడే టామ్‌క్రూజ్‌ ఖరీదైన, భారీ ద్విచక్రవాహనాలను వాడుతుంటాడు. తాజాగా ఈ హాలీవుడ్‌ స్టార్‌ స్టంట్‌లకోసం ఓ భారతీయ బైక్‌ను ఉపయోగించడం విశేషం.

By

Published : Oct 14, 2020, 5:48 AM IST

Tom cruise rides a made in india bike in Mission Impossible
టామ్‌క్రూజ్‌ చిత్రంలో భారతీయ బైక్‌

కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ తిరిగి ప్రారంభమవుతున్నాయి. హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌క్రూజ్‌ సైతం యాక్షన్‌లోకి దిగాడు. మిషన్‌ ఇంపాజిబుల్‌-7 షూటింగ్‌లో ఆయన తిరిగి పాల్గొంటున్నారు. యాక్షన్‌ సీక్వెల్స్‌ని బాగా ఇష్టపడే టామ్‌క్రూజ్‌ ఆయన నటించిన పలు సినిమాల్లో ఖరీదైన, భారీ ద్విచక్రవాహనాలను వాడుతుంటాడు. వాటిపై రయ్‌మంటూ దూసుకెళుతూ భారీ స్టంట్‌లు చేస్తుంటాడు.

టామ్‌క్రూజ్‌ చిత్రంలో భారతీయ బైక్‌

అయితే ఈ హాలీవుడ్‌ స్టార్‌ స్టంట్‌లకోసం ఓ భారతీయ బైక్‌ను వాడటం విశేషం. మిషన్‌ ఇంపాజిబుల్‌ సీక్వెల్‌ షూటింగ్‌లో భాగంగా ఆయన బీఎండబ్ల్యూకి చెందిన జీ 310 జీఎస్‌ బైక్‌ని స్టంట్స్‌లో వినియోగించారు. కాగా ఆ షూటింగ్‌కి సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. భారత్‌లో తయారైన బీఎండబ్ల్యూకి చెందిన పలు వాహనాలను ఇటలీ సహా పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు. ఆ కంపెనీకి చెందిన జీ 310 జీఎస్, జీ 310 ఆర్ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లో ఈమధ్యే విడుదల చేశారు. కాగా వాటిని పలు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేశారు. టామ్‌క్రూజ్‌ వినియోగించిన జీ 310 జీఎస్‌ బైక్‌ దిల్లీ ఎక్స్‌షోరూం ధర రూ.2.85 లక్షలు.

ఇదీ చూడండి:'అన్నీ కుదిరితే అదే టీమ్​తో మరో సినిమా చేస్తా'

ABOUT THE AUTHOR

...view details