తెలంగాణ

telangana

ETV Bharat / sitara

2019: అతిథి పాత్రల్లో స్టార్స్.. అభిమానుల విజిల్స్ - samantha-nandini reddy-naga chaitanya-adivi sesh

ఈ ఏడాది విడుదలైన కొన్ని తెలుగు సినిమాల్లో పలువురు స్టార్స్ ఇలా కనిపించి.. అలా ఆకట్టుకున్నారు. ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించారు. వారిలో దర్శకుడు సుకుమార్, స్వీటీ అనుష్క, హీరోలు నితిన్, నాగచైతన్య, రానా, అడివి శేష్ తదితరులు ఉన్నారు.

అతిథి పాత్రల్లో స్టార్స్.. అభిమానుల విజిల్స్
సుకుమార్-నాగచైతన్య-నితిన్-అనుష్క

By

Published : Dec 22, 2019, 10:14 AM IST

మీరు మీ అభిమాన హీరో సినిమాకు వెళ్లారు. మరో స్టార్.. అతడు/ఆమెతో వెండితెరపై స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆశ్చర్యపోవడం మీ వంతైంది. ఇలాంటి సంఘటనలు ఈ ఏడాది చాలానే జరిగాయి. అందులో కొందరు ప్రముఖ హీరో/హీరోయిన్లల సినిమాలు ఉన్నాయి. వారు కనిపించడమే కాకుండా, కాసేపు నటించి అలరించారు. ఇంతకీ వారెవరు? ఆ చిత్రాలేంటి? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఎన్టీఆర్(కథానాయకుడు-మహానాయకుడు)

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు అతిథి పాత్రలు పోషించారు. వీరిలో రానా(నారా చంద్రబాబు నాయుడు పాత్రలో), రకుల్ ప్రీత్ సింగ్(శ్రీదేవి), పాయల్ రాజ్​పుత్(జయసుధ), హన్సిక(జయప్రద), కల్యాణ్​రామ్(హరికృష్ణ).. సంబంధిత పాత్రల్లో ఆకట్టుకున్నారు.

ఎన్టీఆర్​ బయోపిక్​ పలువురు స్టార్స్

గ్యాంగ్​లీడర్, గద్దలకొండ గణేష్

నాని కథానాయకుడిగా నటించిన 'గ్యాంగ్​లీడర్​'లో, మెగాహీరో వరుణ్​తేజ్ 'గద్దలకొండ గణేష్​'లోనూ దర్శకుడు సుకుమార్ తళుక్కున మెరిశాడు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు.

దర్శకుడు సుకుమార్

గ్యాంగ్​లీడర్

ఓ వైపు హీరోగా రాణిస్తూనే, మరోవైపు విలన్​గా ఆకట్టుకున్నాడు కార్తికేయ. నాని 'గ్యాంగ్​లీడర్​' కోసం తొలిసారి ప్రతినాయకుడి అవతారమెత్తాడు. తన నటనతో ఆకట్టుకున్నాడు. అన్ని పాత్రల్లోనూ తను రాణించగలనని నిరూపించాడు.

నటుడు కార్తికేయ

గద్దలకొండ గణేష్

ఈ చిత్రంలో వచ్చే చివరి సన్నివేశంలో హీరో నితిన్.. నిజ జీవిత పాత్రనే పోషించాడు. ప్రేక్షకులను సర్​ప్రైజ్​ చేశాడు.

నితిన్​తో హీరో వరుణ్​తేజ్

ఓ బేబీ

ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు స్టార్స్.. ఒక్కసారిగా కనిపించి సర్​ప్రైజ్​ చేశారు. వారిలో చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి, హీరోలు నాగచైతన్య, అడివి శేష్ ఉన్నారు.

సమంత-నందినిరెడ్డి-నాగచైతన్య-అడివి శేష్

మన్మథుడు-2

ఈ సినిమాలోనూ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ గెస్ట్​ రోల్స్​లో కనిపించారు. వారిలో సమంత, కీర్తి సురేశ్ ఉన్నారు.

నాగార్జున-సమంత-కీర్తి సురేశ్

సైరా నరసింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి 'సైరా'లో భారీతారగణం నటించారు. విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, అమితాబ్ బచ్చన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. వీరే కాకుండా స్వీటీ అనుష్క శెట్టి.. రాణి రుద్రమదేవిగా కనిపించి, ప్రేక్షకులను సర్​ప్రైజ్ చేసింది.

అనుష్క- విజయ్ సేతుపతి-కిచ్చా సుదీప్

ఇస్మార్ట్ శంకర్

రామ్ 'ఇస్మార్ట్ శంకర్'లో దర్శకుడు పూరీ జగన్నాథ్.. టైటిల్​ సాంగ్​లో కనిపించి, అలరించాడు. ఇది అతడికేం కొత్త కాదు. ఇంతకు ముందు చాలా సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో ఆకట్టుకున్నాడు.

దర్శకుడు పూరీ జగన్నాథ్​తో హీరో రామ్

ఇది చదవండి: 2019లో మెరిపించి మురిపించిన కొత్త భామలు

ABOUT THE AUTHOR

...view details