ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రం 'ది లయన్ కింగ్'. విడుదలైన తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ ప్రముఖ నటులు నాని, జగపతిబాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీ ఇందులోని పాత్రలకు డబ్బింగ్ చెప్పడం విశేషం. హిందీ, తమిళం సహా ఇతర భాషల్లోనూ పేరొందిన నటులు తమ గాత్రాన్ని అందించారు.
సూర్య కిరణాలు పడే ప్రతీ చోటూ వారి రాజ్యమే - జగపతిబాబు
ఎంతో ఆసక్తి రేపిన 'ది లయన్ కింగ్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. బొమ్మాళీ రవిశంకర్ తన గాత్రంతో అలరించాడు. నాని, జగపతి బాబు తదితరులు ఇందులోని పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.
'ది లయన్ కింగ్' తెలుగు ట్రైలర్
1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం 'ది లయన్ కింగ్' రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. జాన్ ఫెర్యూ దర్శకత్వం వహిస్తూ నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: సల్మాన్.. కోతి.. ఓ పర్యావరణ పాఠం