తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 14న జరగనున్న ఈ ఎలక్షన్ కోసం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడారు.
"ప్రస్తుతం 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ పాలక కమిటీ గడువు పూర్తి కానుండటం వల్ల నవంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో ఎవరైనా నామినేషన్ వేయవచ్చు. అదే రోజున 'తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఎన్నికలు జరగనున్నాయి. ఆసక్తిగల వారు ఎవరైనా పోటీ చేయవచ్చు" అని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు.