తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రూపాయికి... 225 రూపాయల లాభం..!

అది 1976వ సంవత్సరం. ఓ వ్యక్తి మూడు రోజుల్లో కథరాసి, తానే కీలక పాత్రలో నటించి తెరకెక్కించిన సినిమా సంచలనం సృష్టించింది. మూవీకి ఎంత ఖర్చు పెట్టాడో అంతకు 225 రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఇంతకూ ఆ సినిమా ఏంటి?

ఒక రూపాయికి... 225 రూపాయలు!

By

Published : Nov 21, 2019, 5:31 AM IST

ఓ సినిమా నిర్మించిన దానికంటే 225 రెట్లు లాభాలు అర్జించింది. ఆ సినిమా నటుడిని సూపర్​స్టార్​ని చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. అంతేకాదు మూడు ఆస్కార్​ అవార్డులూ సొంతం చేసుకుంది. అదే పేరుతో ఆరు సీక్వెల్​ సినిమాలకు నాంది పలికింది. ఇన్ని ఘనతలు సాధించిన ఆ సినిమా ఎంటో తెలుసా?.. 'రాకీ'. సిల్వస్టర్‌ స్టాలోన్‌ కథ రాసి, కీలక పాత్రలో తనే నటించిన ఈ సినిమా 1976లో విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం ఒక మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా 225 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది.

క్రీడల నేపథ్యంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది. ఈ సినిమా తర్వాత ఆరు కొనసాగింపు సినిమాలు వచ్చి అన్నీ కాసుల వర్షం కురిపించాయి. వీటిలో అయిదింటిని సిల్వస్టర్‌ స్టాలోనే కథ రాశాడు. నాలుగింటికి తనే దర్శకత్వం వహించాడు. ఈ అన్ని సినిమాల్లో తానే రాకీగా నటించాడు. ఓ వడ్డీ వ్యాపారి దగ్గర బాకీలు వసూలు చేసే ఓ యువకుడు అనుకోని అవకాశం వచ్చి, ఆరు వారాల వ్యవధిలో ప్రపంచ హెవీవెయిట్‌ ఛాంపియన్‌గా ఎలా మారాడనేదే కథ. సిల్వస్టర్‌ స్టాలోన్‌ టీవీలో మహమ్మద్‌ ఆలీ బాక్సింగ్‌ పోటీని చూసి స్ఫూర్తి పొంది కేవలం మూడు రోజుల్లో ఈ సినిమా కథను రాశాడు.

ఇవీ చూడండి : 'పవన్ చూసి చూడనట్లు వెళ్లిపోయాడు'

ABOUT THE AUTHOR

...view details