బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును పట్నాలో నమోదు చేయడం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందని మంగళవారం బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని ఆరోపించింది. కనీసం సుశాంత్‌కు సంబంధించిన పోస్ట్‌మార్టమ్ రిపోర్టును కూడా ముంబయి పోలీసులు అందించలేదని బిహార్ గవర్నమెంట్ వెల్లడించింది.
ఆయన హస్తం ఉంది
సుశాంత్ మరణంపై ముంబయి పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బిహార్ ప్రభుత్వ తరపు న్యాయవాది మనీందర్ సింగ్.. జస్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వం వహించిన ధర్మాసనానికి వెల్లడించారు. రాజకీయ ఒత్తిడి, పక్షపాతం కారణంగా నటి రియా చక్రవర్తిపై బిహార్ రాష్ట్ర గవర్నమెంట్ నేరారోపణలు మోపుతుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలన్న నటి రియా వ్యాజ్యంపై వాదనలు జరిగాయి. దీని వెనుక బిహార్ ముఖ్యమంత్రి హస్తం ఉందని.. దర్యాప్తు చేయడానికి ఆయనే వ్యక్తిగతంగా ఓ ఐపీఎస్ ఆఫీసర్‌ను నియమించారన్న వాదనలను బలంగా తిప్పికొట్టారు న్యాయవాది మనీందర్ సింగ్.