తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సన్నీ లియోనీ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?

హాట్​ హాట్​ అందాలతో కుర్రకారును కట్టిపడేస్తోంది బాలీవుడ్​ నటి సన్నీలియోనీ. నలభై ఏళ్ల వయసులోనూ నాజూగ్గా కనిపిస్తూ.. యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. అంతటి అందంతో పాటు కచ్చితమైన శరీరాకృతితో ఫిట్​నెస్​ను ఎలా కొనసాగిస్తోందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఆమె రోజూ అనుసరించే డైట్​ ఎంటో మీరూ చదివేయండి.

Sunny Leone's diet plan: Here's all what it takes for a fit body
సన్నీలియోనీ బ్యూటీ, డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?

By

Published : Aug 8, 2021, 1:30 PM IST

కరణ్​జీత్​ కౌర్​గా బాలీవుడ్​లో అడుగుపెట్టిన సన్నీలియోనీ.. ఇప్పుడు ఓ అందాల తారగా, కుర్రకారు పాలిట కలల రాకుమారిగా ఎదిగింది. తన నటనతో పాటు అందచందాలతోనూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 40 ఏళ్ల వయసులోనూ ఆమె హాట్​ హాట్​ అందాలు కుర్రకారు మతిపోయేలా చేస్తున్నాయి. తాను నటించిన తొలి చిత్రం రిలీజ్​ తర్వాత.. తన శరీరాకృతిని మార్చుకోవాలని నిర్ణయించుకుంది సన్నీ. ఆ తర్వాత సరైన డైట్​ ఫాలో అవుతూ.. ఫిట్​నెస్​తో మోస్ట్​ సెక్సీయెస్ట్​ హీరోయిన్​గా ఎదిగింది.

ఆరోగ్య సమస్యల కారణంగా కొన్నేళ్ల క్రితం శాకాహారిగా మారిన సన్నీలియోనీ.. ఫిట్​గా ఉండడం ఎంతో ముఖ్యమని భావిస్తోంది. అందుకోసం ఆమె వారానికి రెండు లేదా మూడు సార్లు జిమ్​ చేస్తానని చెప్పుకొచ్చింది. దీంతో పాటు అప్పుడప్పుడు యోగా కూడా చేస్తానని వెల్లడించింది. దీనికోసం ఆమె తీసుకునే డైట్​ ఏంటో తెలుసుకుందాం.

సన్నీలియోనీ

1) అల్పాహారం

రోజులో అల్పాహారం తనకు ఇష్టమైన భోజనమని నటి సన్నీలియోనీ అనేక ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. నిద్రలేచిన తర్వాత మొదటగా ఓ గ్లాసు కొబ్బరి నీరు లేదా నిమ్మరసం తాగుతానని చెప్పింది. కాఫీని పూర్తిగా మానేసేందుకు రకరకాల పానీయాలను అలవాటు చేసుకుంటున్నట్లు వెల్లడించింది.

దాల్చిన చెక్క, బ్రౌన్​ షుగర్​, వోట్​ మీల్​, యాపిల్​ సిన్నమోన్​ వోట్​మీల్​ను అల్పాహారంగా తీసుకుంటానని సన్నీ అంటోంది. అతిగా తినడాన్ని మానుకునేందుకు చిన్న పరిమాణంలో ఆహారాన్ని భుజిస్తున్నట్లు పేర్కొంది.

2) మధ్యాహ్న భోజనంలో..

సన్నీలియోనీ ఏ డైట్​ ప్లాన్​ అనుసరించాలనేది ఆమె డైటీషియన్ సూచనలిస్తుంది. మధ్యాహ్న భోజనంలో కొద్దిగా వెనిగర్​, నూనె, ఉప్పు, మిరియాల పొడి చల్లిన తాజా కూరగాయలు.. టీ, కాఫీ బదులుగా పండ్ల రసాన్ని ఎంచుకుంటుంది. తినడాన్ని తగ్గించుకునేందుకు ఎక్కువగా ఆహారాన్ని వాసన చూసి వదిలేస్తానని సన్నీ చెబుతోంది. ​

సన్నీలియోనీ

3) రాత్రి భోజనంలో..

రాత్రికి భోజనంలో సన్నీలియోనీ చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో ఏవైతే తీసుకుందో.. దాన్ని రాత్రికి తక్కువ మోతాదులో తీసుకుంటుంది.

4) సన్నీలియోనీ తీసుకునే ఆరోగ్యకరమైన చిరుతిండ్లు

చిరుతిండ్ల విషయంలో మాత్రం నటి సన్నీలియోనీ ఎలాంటి డైట్​ ప్లానింగ్​ను పాటించదు. తనకు ఇష్టమైన చిరుతిండ్లను తినేందుకు ఆలోచించదు. ఉదాహరణకు పాప్​కార్న్​ తినాలని ఆమె అనుకుంటే అందులో బటర్​, ఉప్పు లేకుండా భుజిస్తుంది.

ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మే సన్నీలియోనీ.. ప్రతిఒక్కరూ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తోంది. అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకుండా.. మితంగా తినాలని చెబుతోంది.

సన్నీలియోనీ

సన్నీలియోనీ సూచించే మరికొన్ని చిట్కాలు ఏంటో చూద్దాం.

  1. జంక్​ఫుడ్​కు దూరంగా ఉండాలని సన్నీలియోనీ సూచిస్తోంది. అయితే దాని నుంచి దూరంగా ఉండడం కొంచెం కష్టమే!
  2. ఫ్రిజ్​లో కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉంచి.. ఆకలి సమయంలో వాటినే భుజించడం వల్ల జంక్​ ఫుడ్​కు దూరంగా ఉండే అవకాశం ఉందని ఆమె చెబుతోంది.
  3. చర్మం కాంతివంతంగా ఉండడం సహా ఆరోగ్యకరమైన శరీరం కోసం ఎక్కువ నీటిని తాగాలని సన్నీ అంటోంది.
  4. భోజనంలో ఎక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని మినహాయించుకునేందుకు.. భోజనానికి ముందు 100 కాలరీల స్నాక్స్​ తీసుకుంటే మంచిదని సన్నీ వెల్లడించింది.
  5. శరీరాకృతి కోసం ఆకలితో ఉండడం మంచిది కాదని సన్నీ సూచన.
  6. శుభ్రపరిచిన ఆహారాన్ని భుజించడం సహా చక్కెర ఎక్కువగా ఉన్న సాఫ్ట్​ డ్రింక్స్​ను తీసుకోకపోవడమే ప్రయోజనకరమని సన్నీలియోనీ చెబుతోంది.

ఇదీ చూడండి..బ్యూటీ విత్​ గోల్డెన్​ హార్ట్​.. సన్నీలియోనీ!

ABOUT THE AUTHOR

...view details