హాస్యనటుడిగా తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు సునీల్. కొంతకాలానికి హీరో అవకాశం అందుకున్నాడు. ఇటీవలే విలన్‌గానూ మారి ఆశ్యర్యంలో పడేశాడు. ఇప్పుడు మళ్లీ తనకు బాగా పేరు తెచ్చిన కామెడీని పండించేందుకు సిద్ధమయ్యాడని టాక్.
మూడో హీరోగా సునీల్ చేస్తున్నాడా?
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఎఫ్ 2'. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఇందులో ముగ్గురు హీరోలుగా చేస్తారని తెలుస్తోంది. వెంకీ, వరుణ్‌లతో పాటు సునీల్‌కు ఈ అవకాశం దక్కిందని సమాచారం.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌తో అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' తెరకెక్కిస్తున్నాడు విజయవంతమైన వినోదాత్మక చిత్రం 'ఎఫ్ 2'కి సీక్వెల్‌గా రూపొందనుంది. ఈ ప్రాజెక్టులో మరో హీరో రవితేజ కూడా నటిస్తున్నాడంటూ గతంలో ప్రచారం సాగింది. కాదు అని కొన్నాళ్లకు ఓ స్పష్టత వచ్చింది. తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. సునీల్ ఈ చిత్రంలో నటించే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కీలక పాత్ర కోసం సునీల్‌ని తీసుకునే ఆలోచనలో అనిల్ ఉన్నాడని వినికిడి. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు.
అయితే మూడో హీరోగా సునీల్ తీసుకుని ముగ్గురు హీరోల మల్టీస్టారర్ తెరకెక్కిస్తారా? కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితం చేస్తారా? అనే సందేహం మొదలైంది సినీ అభిమానుల్లో. ఏది ఏమైనా అనిల్ రావిపూడి కామెడీ స్ర్కిప్టుకి సునీల్ నటన తోడైతే ప్రేక్షకుల పొట్టలు చెక్కలవ్వాల్సిందే. సునీల్ ప్రతినాయక పాత్ర పోషించిన 'కలర్ ఫోటో' చిత్రం అక్టోబరు 23న విడుదలకు సిద్ధంగా ఉంది.