సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అభిమానుల్ని ఆకట్టుకుంటోందీ చిత్రం. ఇందులో హీరోయిన్ రష్మిక చెప్పిన "మీకు అర్థమవుతోందా?" డైలాగ్ బాగా ఫేమస్ అయింది. సామాజిక మాధ్యమాల్లో యువత.. దీనిని తెగ అనుకరించేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మహేశ్ కూతురు సితార చేరింది. దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి ఈ డైలాగ్ చెప్పింది. నెటిజన్ల మనసు దోచేస్తోంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాలో మహేశ్.. ఆర్మీ అధికారిగా కనిపించాడు. విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిచాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అనిల్ సుంకర-దిల్‌రాజు-మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు.