తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కప్పెలా' రీమేక్‌లో మలయాళీ చిన్నది! - Anikha surendran movies list

మలయాళంలో ప్రశంసలు అందుకున్న 'కప్పెలా' (kappela movie) ను తెలుగులో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రీమేక్‌ చేస్తోంది. ఈ సినిమా కోసం ముందు రాజశేఖర్‌ కూతురు శివాత్మికను అనుకున్నారట. తాజాగా గత నెలలో ప్రారంభమైన ఈ సినిమాలో శివాత్మికకు బదులుగా అనిఖా సురేంద్రన్​ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Kappela movie remake
అనిఖా సురేంద్రన్​

By

Published : Aug 10, 2021, 8:09 AM IST

Updated : Aug 10, 2021, 9:03 AM IST

ఇప్పటికే ఎంతోమంది పొరుగు రాష్ట్రాల నటులు టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు మరో మలయాళీ చిన్నది(malayali beauty) కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అజిత్‌-నయనతార జంటగా వచ్చిన 'విశ్వాసం', అజిత్‌-అనుష్కశెట్టి నటించిన ఎంతవాడుగానీ' సినిమాల్లో అజిత్‌ కూతురిగా నటించిన చిన్నది గుర్తుందా..! ఆమె పేరు అనిఖా సురేంద్రన్‌. ఇప్పటికే మలయాళంతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. నాగార్జున హీరోగా ప్రవీణ్‌సత్తారు తెరకెక్కిస్తున్న చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో పాటు ఓ తెలుగు రీమేక్‌లోనూ ఈ చిన్నది ఓ కీలకపాత్రలో ఛాన్స్‌ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మలయాళంలో ప్రశంసలు అందుకున్న 'కప్పెలా'(kappela movie)ను తెలుగులో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రీమేక్‌ చేస్తోంది. ఇందులో సిద్ధూ జొన్నలగడ్డ, అర్జున్‌దాస్‌ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. చంద్రశేఖర్‌ టి.రమేశ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా కోసం ముందు రాజశేఖర్‌ కూతురు శివాత్మికను అనుకున్నారట. గత నెలలో ప్రారంభమైన ఈ సినిమాలో శివాత్మికకు బదులుగా అనిఖాను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి శివాత్మిక ఎందుకు తప్పుకొంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:Navarasa Review: 'నవరస' వెబ్​సిరీస్​ ఆకట్టుకుందా?

Last Updated : Aug 10, 2021, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details