రెబల్‌స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా తెరపై మెరిసినా.. ‘వర్షం’, ఛత్రపతి’, ‘డార్లింగ్’, ‘మిర్చి’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు ప్రభాస్. ఇక ‘బాహుబలి’, ‘సాహో’ వంటి చిత్రాలతో తన పెద్దనాన్న గర్వపడే రీతిలో వరల్డ్స్టార్గా ఎదిగిపోయాడు డార్లింగ్.
తాజాగా సీనియర్ రెబల్‌స్టార్ తన పుట్టినరోజు వేడుకల్లో ప్రభాస్ ఎదుగుదలపై ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వేడుకల్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించాడు.
'బొబ్బిలి బ్రహ్మన్న' ప్రభాస్
ఈ వేడుకలో ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు సతీమణి శ్యామల... డార్లింగ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కృష్ణంరాజు చిత్రాల్లో ప్రభాస్ ఏదైనా రీమేక్ చెయ్యాలనుకుంటే.. బొబ్బిలి బ్రహ్మన్న’ చేస్తే బాగుంటుందని తన మనసులో మాటను పంచుకున్నారు.
'పెళ్లి'పై నో క్లారిటీ
ఇక ప్రభాస్ పెళ్లి విషయంపై క్లారిటీ ఇస్తూ... సమయం వచ్చినప్పుడు అదే అవుతుందని చిరునవ్వులు చిందించారు రెబల్‌స్టార్ జంట. నిజానికి సాహో’ తర్వాత పక్కాగా ప్రభాస్ పెళ్లి కబురు అందుతుందని నిన్నమొన్నటి వరకు వాళ్ల కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించనట్లే అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న కొత్త చిత్రం ఈ ఏడాది చివరి నాటికి కానీ పూర్తికాదు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొస్తుంది. కనుక వచ్చే ఏడాది ప్రథమార్థం వరకు ప్రభాస్ ఫుల్ బిజీ అని ఇప్పటికే అర్థమైపోయింది. కాబట్టి ఆయన నుంచి ఈ శుభవార్తను అభిమానులు ఇప్పట్లో ఆశించడం కష్టమని తేలిపోయింది.
ఇదీ చూిడండి : 'రాయల్ లుక్'లో అదరగొట్టిన ఇస్మార్ట్ శంకర్