ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఫుల్ మాసీ అవతారంలో కనిపించి సినీప్రియులను థ్రిల్ చేశాడు ఎనర్జిటిక్ స్టార్ 'రామ్'. ఇప్పుడేమో అకస్మాత్తుగా రాయల్ లుక్‌తో దర్జా ఒలకబోస్తూ బయటకొచ్చాడు. చదరంగం బోర్డుపై ఠీవిగా కనపడుతూ.. రాజులా కరవాలం చేత పట్టుకుని సీరియస్ లుక్స్‌తో స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు.
ఇంతకీ ఈ ఎనర్జిటిక్ స్టార్ ఉన్నట్లుండి ఇలా రాయల్ కింగ్‌లా ఎందుకు బయటకొచ్చినట్లు? ఇది చూశాక తన కొత్త చిత్రం ‘'రెడ్'’ కోసం చేసిన పాత్ర అనుకుంటే మీరు పొరబడినట్టే.
ది రాయల్ 2020
రామ్ ఇలా అకస్మాత్తుగా రాజుగా కొత్త అవతారమెత్తింది మరెందుకో కాదు.. ది రాయల్స్ 2020 మ్యాగజైన్ క్యాలెండర్ కోసం. ఈ మ్యాగజైన రూపొందించిన ఈ కొత్త ఏడాది క్యాలెండర్‌లో మే నెల కవర్ పేజిపై దర్శనమివ్వనున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను సంస్థ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఇక ఇదే క్యాలెండర్‌లోని వివిధ నెలల కవర్ పేజీలపై శింబు, అధర్వ, అరుణ్ విజయ్ వంటి పలువురు తమిళ స్టార్లు కూడా తళుక్కున మెరిశారు.
ఇదీ చూడండి : ఆ సినిమాలో కీర్తి సురేశ్ బదులుగా ప్రియమణి