దీపావళి జోష్‌ను మరింత పెంచేందుకు సిద్ధమయ్యాడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. 'సరిలేరు నీకెవ్వరు' కొత్త పోస్టర్‌తో అభిమానుల్లో జోష్ పెంచుతున్నాడు. బుల్లెట్‌పై కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈరోజు ఉదయం విజయశాంతి పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దాదాపు 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఈ మాజీ హీరోయిన్.. భారతి అనే పాత్రలో కనిపించనుంది.
బుల్లెట్‌పై ఒక్కడు.. సరిలేరు నీకెవ్వరు - రష్మిక కొత్త సినిమా
సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మహేశ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. బుల్లెట్‌పై కనిపిస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నాడు.
హీరో మహేశ్‌బాబు
ఆర్మీ నేపథ్య కథాంశంతో తెరకెక్కుతోందీ చిత్రం. మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు మహేశ్. రష్మిక హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిల్ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: సరిలేరు నీకెవ్వరులో రాములమ్మ పోస్టర్ అదరహో..!
Last Updated : Oct 26, 2019, 7:23 PM IST