భారతీయ చిత్రకళలో రాజా రవివర్మది అందె వేసిన చేయి. రామాయణ, మహాభారతంలోని ఘట్టాలను చిత్రాలుగా మలిచి గుర్తింపు పొందాడు. తాజాగా అతని పెయింటింగ్లను రీక్రియేట్ చేస్తూ ఓ ఫొటోషూట్ చేశాడు యువ ఫొటోగ్రాఫర్ వెంకట్ రామ్.
నిమ్మకాయ పట్టుకుని ఉన్న మహిళ బొమ్మ రవివర్మ అద్భుత చిత్రాల్లో ఒకటి. ఇదే తరహాలో సామ్ ఫోజులిచ్చింది. ఇందులో భాగంగా తీసిన సమంత ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు 'రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో' అని వేటూరి రాసిన పాటను కామెంట్ల రూపంలో పెడుతున్నారు.