ఆరోగ్యకర జీవనశైలిని ప్రజలు అనుసరించాలనే లక్ష్యంతో మెగాకోడలు ఉపాసన, 'యువర్ లైఫ్. కామ్' వెబ్‌సైట్‌ను ఇటీవల ప్రారంభించారు. స్టార్ హీరోయిన్ సమంత అతిథి సంపాదకురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సామ్, ఉపాసన కలిసి 'తక్కలి సదం' వంటకాన్ని తయారు చేశారు. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. ప్రజలు దీన్ని తమ ఆహారపు అలవాట్లలో భాగం చేసుకోవాలని సూచించారు. తయారీ వీడియోను పోస్ట్ చేశారు.
కరోనా వల్ల ప్రజల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి. మంచి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వ్యాయామాలు చేయాలి తదితర విషయాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఉపాసన. 'యువర్ లైఫ్. కామ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఆరోగ్య సూత్రాలు చెబుతున్నారు. ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, కొన్ని ప్రత్యేక సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం.