సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'రాధే'. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్ను దక్కించుకుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'సీటీమార్', 'దిల్ దే దియా' ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, జరీనా వాహబ్, రణదీప్ హుడా కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా కారణంగా సినిమాను థియేటర్లతో పాటు నేరుగా ఓటీటీలోనూ విడుదల చేయనున్నారు.