Salman Khan IIFA Awards: బాలీవుడ్‌కు ఎంతో ఇష్టమైన అవార్డుల వేడుక 'ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్' (ఐఫా). పురస్కారాలు అందుకోవడమే కాకుండా.. తారలందరూ ఒకచోట చేరి ఆటపాటలతో సందడి చేసే కార్యక్రమం అది. వచ్చే ఏడాది జరగనున్న ఈ పురస్కారాల వేడుకకు ఈ సారి అబుదాబి వేదిక కానుంది. 22వ 'ఐఫా' వేడుకలు అబుదాబిలోని యస్ ఐల్యాండ్‌లో వచ్చే ఏడాది మార్చి 18, 19 తేదీల్లో జరగనున్నట్టు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
అబుదాబి వేదికగా ఐఫా వేడుక.. వ్యాఖ్యాతగా సల్మాన్ - సల్మాన్ ఖాన్ ఐఫా అవార్డ్స్ 2022
Salman Khan IIFA Awards: 22వ 'ఐఫా' వేడుకలను అబుదాబి వేదికగా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. వచ్చే ఏడాది మార్చిలో ఈ కార్యక్రమం జరపనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారాల వేడుకకు బాలీవుడ్ స్టార్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
సల్మాన్ ఖాన్ ఐఫా
"75వ భారత స్వాతంత్య్ర వేడుకలు, యూఏఈ 50 ఏళ్ల పండగ సందర్భంగా 22వ 'ఐఫా' వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం. భారతీయ చిత్ర సీమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప కార్యక్రమంగా ఈ వేడుకను నిర్వహిస్తాం" అని 'ఐఫా' నిర్వాహకులు ప్రకటించారు.
ఇదీ చూడండి: బాలీవుడ్ కాదు.. నా టార్గెట్ అదే: అల్లు అర్జున్