20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి నటించనుంది టబు. చివరగా 'హమ్ సాత్ సాత్ హై'(ప్రేమానురాగం) చిత్రంలో వీరిద్దరు కలిసి పనిచేశారు. తాజాగా సైఫ్ హీరోగా చేస్తున్న 'జవానీ జానేమన్' సినిమాలో టబు నటించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. వచ్చే నెల నుంచి 45 రోజుల పాటు లండన్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.
20ఏళ్ల తర్వాత సైఫ్, టబుల 'ప్రేమానురాగం 2.0'
సైఫ్ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'జవానీ జానేమన్' చిత్రంలో టబు నటించనుంది. 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. వచ్చే నెల నుంచి లండన్‌లో తొలి షెడ్యూల్ జరగనుంది.
టబూ
"టబు చాలా గొప్ప నటి. ఆమెతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా" అని సైఫ్ తెలిపాడు. పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్, నార్తర్న్ లైట్ ఫిల్మ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ సినిమాకు సైఫ్ అలీ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
సైఫ్, టబు 1996లో వచ్చిన 'తు చోర్.. మై సిపాయి' చిత్రంలో తొలిసారి కలిసి పనిచేశారు.