తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్​లోనే 'సోలో బ్రతుకే సో బెటర్​'.. రిలీజ్​ ఎప్పుడంటే?

హీరో సాయిధరమ్​ తేజ్​ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్​' సినిమా డిసెంబరులో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్​. అది కూడా థియేటర్లలలోనే రిలీజ్​ చేస్తామని స్పష్టం చేసింది.

By

Published : Nov 18, 2020, 8:41 PM IST

Sai dharam
సోలో బ్రతుకే సో బెటర్​

సాయిధరమ్‌ తేజ్,‌‌ నభా నటేశ్‌ జంటగా నటించిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్‌'. లాక్‌డౌన్‌కు ముందే షూటింగ్‌ పనులు మొదలుపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్‌లో అదీ థియేటర్లలో విడుదల చేయనున్నట్లు జీ స్టూడియోస్‌ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాకు సుబ్బు దర్శకుడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. సంగీత దర్శకుడు తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

జీ స్టూడియోస్​ ప్రకటన మేరకు సినిమా థియేటర్లలో విడుదల చేయగలిగితే.. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా హాళ్ల‌లో సందడి చేసే మొదటి చిత్రంగా రికార్డు సృష్టించనుంది.

ఇదీ చూడండి :'ఒగ్గేసి పోకే అమృత' అంటోన్న సాయితేజ

ABOUT THE AUTHOR

...view details