మిశ్రమ స్పందనలు వస్తున్నప్పటికీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది సాహో. ప్రభాస్ నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలై బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. రిలీజైన 5 రోజుల్లోనే రూ. 350 కోట్ల కలెక్షన్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
5 రోజుల్లో రూ. 350 కోట్లతో సాహో సునామీ! - shradha
విడుదలైన 5 రోజుల్లోనే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది సాహో చిత్రం. 2019లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.
సాహో
ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ - ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.
ఇది చదవండి: మెగాఫోన్ పట్టనున్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్
Last Updated : Sep 29, 2019, 9:33 AM IST