తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 12:17 PM IST

ETV Bharat / sitara

'రెడ్' సందడి షురూ.. రెండు పాత్రల్లో రామ్

కథానాయకుడు రామ్​ కొత్త సినిమా 'రెడ్' లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడట ఈ హీరో.

'రెడ్' సందడి షురూ.. రామ్ ద్విపాత్రాభినయం

ఇస్మార్ట్​ శంకర్ రామ్.. కొత్త సినిమా 'రెడ్' లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో బుధవారం పూజా కార్యక్రమం జరిగింది. జెమిని కిరణ్​ కెమెరా స్విచాన్​ చేయగా, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి క్లాప్​ కొట్టారు. వచ్చే నెల 16 నుంచి షూటింగ్ మొదలుకానుంది.

నిర్మాత స్రవంతి రవికిశోర్​, రామ్​తో పూరీ జగన్నాథ్, ఛార్మి

ఇప్పటికే విడుదలైన రామ్ లుక్స్​ ఆకట్టుకుంటున్నాయి. మరోసారి మాస్​ పాత్రలో అలరించనున్నాడు. తమిళ హిట్​ 'తడమ్​' రీమేక్​గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించనున్నారట. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

రెడ్ సినిమాలో రామ్ లుక్స్

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇంతకు ముందు రామ్​తో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు తీశాడీ డైరక్టర్.

అభిమానులకు అభివాదం చేస్తున్న హీరో రామ్
రెడ్ సినిమా ప్రారంభోత్సవం

ఇది చదవండి: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్​లో మూడో సినిమా ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details