తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టార్ట్ కెమెరా యాక్షన్.. హీరో రవితేజ డైరెక్షన్

సహాయ దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి 'చైతన్య' సినిమాతో సహాయనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు రవితేజ. అనంతరం ఒక్కో మెట్టూ ఎదుగుతూ మాస్ మహారాజాగా ప్రేక్షకులమదిలో స్థానం సంపాదించాడు. తనలోని సినీ ప్రియుడిని సంతృప్తి పరిచేందుకు త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు చెప్పాడు.

By

Published : Jan 19, 2020, 7:32 PM IST

raviteja
స్టార్ట్ కెమెరా.. యాక్షన్-రవితేజ డైరెక్షన్

అభిమానులు.. మాస్​ మహారాజా అంటూ ముద్దుగా పిలుచుకునే హీరో రవితేజ. సహాయ దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి ఆపై సహాయ నటుడిగా అనేక ఏళ్ల పాటు ప్రయాణం సాగించాడు. అక్కడి నుంచి హీరోగా మారి, తనదైన శైలిలో చెలరేగి సినీప్రియుల మదిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తానంటున్నాడు. మెగాఫోన్ చేతబట్టుకుని దర్శకత్వం చేయాలని ఉందన్నాడు.

'డిస్కోరాజా' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో మాట్లాడిన రవితేజ.. తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.ఓ చక్కటి కమర్షియల్‌ చిత్రానికి దర్శకత్వం వహించాలని ఉందన్నాడు. అదెప్పుడు జరుగుతుందనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేనని అన్నాడు. ఏం చేసినా నిర్మాణ రంగం వైపు మాత్రం దృష్టి సారించే అవకాశం అసలు లేదని స్పష్టం చేశాడు.

ఇదీ చూడండి: మేమిద్దరం కలిస్తే ఆ విషయాలే మాట్లాడుతాం: నభా నటేశ్

ABOUT THE AUTHOR

...view details