తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మీ ప్రేమ కోసం ఈ గాయాలు భరిస్తా: రామ్​ - పీటర్ హెయిన్

టాలీవుడ్ హీరో రామ్​ కొత్త చిత్రం 'రెడ్​'. ఈ సినిమా చిత్రీకరణలో చాక్లెట్ బాయ్ గాయపడ్డాడు. ఆ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా తెలియజేశాడు.

Ram injury in shooting Video release in twitter
రామ్​

By

Published : Dec 26, 2019, 7:21 PM IST

'ఇస్మార్ట్ శంకర్'తో సూపర్ హిట్​ను ఖాతాలో వేసుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ప్రస్తుతం తనకు 'నేను శైలజ' వంటి మంచి హిట్​ను ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ పోరాట సన్నివేశ చిత్రీకరణలో గాయపడిన రామ్​.. ఫైట్ మాస్టర్ పీటర్​హెయిన్​ను ఉద్దేశిస్తూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేశాడు.

"డియర్ పీటర్ హెయిన్.. మీరు నాకు ఇచ్చే పెయిన్ లాగే.. మీకు నామీద ఉండే ప్రేమను ఫీల్ కాగలం కానీ చూడలేం. ఇప్పుడే రషెస్ చూశా. మతిపోయేలా ఉన్నాయి" - రామ్​ ట్వీట్

"నిన్న నువ్వు అద్భుతమైన పోరాట ఘట్టాలను రూపొందించావు​. నిన్ను నేను మిస్ అవ్వట్లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా" అని తన గాయాలను చూపిస్తూ బాధను బయటపెట్టాడు రామ్​.

స్రవంతి మూవీస్ బ్యానర్​పై స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూటింగ్.. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ అధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఇందులో రామ్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చనున్నాడు.

ఇదీ చదవండి: 'ఓ కంప్యూటర్.. రెండు హార్డ్​డిస్క్​లతో సినిమా పూర్తి చేశాం'

ABOUT THE AUTHOR

...view details