తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Prabhas Salaar: 'సలార్'​ క్రేజీ అప్డేట్.. రాజమన్నార్​గా స్టార్ నటుడు - prabhas salaar movie news

యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న 'సలార్​'లోని కీలకపాత్రను పరిచయం చేశారు. రాజ​మన్నార్​గా జగపతిబాబు (jagapathi babu salaar) కనిపించనున్నట్లు వెల్లడించారు.

Rajamannar character From The Upcoming Film 'Salaar'
ప్రభాస్ సలార్

By

Published : Aug 23, 2021, 11:17 AM IST

Updated : Aug 23, 2021, 1:30 PM IST

'సాహో' తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(prabhas) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌ల్లో 'సలార్‌' ఒకటి. ప్రశాంత్‌ నీల్‌ (prashanth neel salaar) దర్శకుడు. ఈ సినిమా అప్‌డేట్‌ల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలోనే సోమవారం ఉదయం ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.

జగపతిబాబు రాజ​మనార్ పాత్ర లుక్

చిత్రంలోని కీలక పాత్రను పరిచయం చేసింది. రాజ​మన్నార్​గా(salaar rajamannar) నటిస్తున్న జగపతిబాబు లుక్‌ విడుదల చేసింది. ఇందులో ఆయన ముక్కుకు రింగు, కోపం నిండిన చూపులతో ఫుల్‌ సీరియస్‌ లుక్‌లో కనిపిస్తూ, ఆకట్టుకుంటున్నారు.

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రభాస్‌ వైల్డ్‌, సీరియస్‌ లుక్‌లో కనిపించనున్నారు. తొలిసారి శ్రుతిహాసన్‌తో(salaar shruti haasan) స్క్రీన్‌ షేర్ చేసుకుంటున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. హంబులే ఫిల్మ్స్‌ బ్యానర్‌ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 23, 2021, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details