దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆర్.కె. ఫిలిమ్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్ రావు కన్నుమూశారు.
కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రముఖ నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్ రావు చిరంజీవి, మోహన్‌బాబు సంతాపం
కృష్ణమోహన్‌రావు మృతిపై ప్రముఖ నటులు చిరంజీవి, మోహన్‌బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కృష్ణమోహన్ లేని లోటు తీరనిదని చిరంజీవి అన్నారు. తాను నటించిన 'యుద్ధభూమి' చిత్రాన్ని ఆయన నిర్మించారని గుర్తు చేసుకున్నారు. కృష్ణమోహన్‌రావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కృష్ణమోహన్ మరణవార్త విని తన మనసు చలించిపోయిందని మోహన్‌బాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి:ఆయనతో గొడవపడి ఆకాశం రంగు మార్చా!
ఇదీ చూడండి:దర్శకేంద్రుడు తొలిసారి పండు వాడిన చిత్రమిదే!