తెలంగాణ

telangana

మూడు మతాలకు ఒకే దేవాలయం​.. లారెన్స్​ ప్రకటన

By

Published : Mar 3, 2020, 11:10 AM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్​, దర్శకుడు రాఘవ లారెన్స్​ తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. తాను త్వరలో మూడు మతాలకు కలిపి ఓ దేవాలయం కట్టనున్నట్లు స్పష్టం చేశాడు.

South indian movie actor Raghava Lawrance plan to built one temple for three relegion
మూడు మతాలకు ఒకే టెంపుల్​... రాఘవ లారెన్స్​ ప్రణాళిక

కోలీవుడ్​ ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సినిమాలతో పాటు సేవా కార్య‌క్ర‌మాల ద్వారా అభిమానులకు ఎప్పుడూ గుర్తుంటాడు. తాజాగా ఇతడు ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఒకే దగ్గర ప్రార్థనలు చేసుకునేలా ఓ ఆలయం నిర్మించనున్నట్లు తెలిపాడు. తాజాగా శ్రీ రాఘవేంద్ర స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. అయితే దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోటిన్నరతో ఇళ్ల నిర్మాణం..

లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లకు ఇళ్లు కట్టించేందుకు ప్రణాళికనూ రచించాడీ స్టార్​ దర్శకుడు. అయితే ఈ మంచిపని కోసం ఇటీవల భారీ విరాళం అందించాడు బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్​. దాదాపు రూ.1.5 కోట్ల సాయం చేశాడు. ఈ ట్రస్ట్‌ పేరుతో విద్య, చిన్నారుల కోసం వసతిగృహాలు‌, అంతేకాకుండా దివ్యాంగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో కార్యక్రమాలూ నిర్వహిస్తున్నాడు లారెన్స్​.

ప్రస్తుతం ఇతడు 'కాంచన' హిందీ రీమేక్‌ 'లక్ష్మీ బాంబ్‌'ను తెరకెక్కిస్తున్నాడు. హీరో, హీరోయిన్లుగా అక్షయ్‌ కుమార్‌, కియారా అడ్వాణీ నటిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details