'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించే చిత్రాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గటే ఈ హీరో ప్రణాళికలు కూడా ఉన్నాయి. 'సాహో' తర్వాత ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు విదేశాల్లో చిత్రీకరణ జరుపుకొన్న ఈ సినిమా ఇప్పుడు భాగ్యనగరానికి వచ్చింది. ఈ వారం నుంచి ఇక్కడే చిత్రీకరణ జరుపుకోనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.
మూడు భాషల్లో... ప్రభాస్ కొత్త సినిమా - సాహో
ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ విడుదల చేసింది చిత్రబృందం. త్వరలోనే రెండో షెడ్యూల్‌ను ప్రారంభిస్తామని తెలిపింది.
ప్రభాస్
ఈ సినిమాలో పూజా హెగ్డె కథానాయిక. మూడు భాషల్లో దీన్ని రూపొందిస్తున్నారు. గోపికృష్ణ మూవీస్‌తో పాటుగా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఇది 17వ శతాబ్దంలో సాగే ఒక పిరియాడికల్ ప్రేమ కథ అని సమాచారం. దీనికి 'జాన్' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. క్రష్ ఫస్ట్‌లుక్: ఈసారి యువతే టార్గెట్