తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అలాంటి సిల్లీ విషయాలకు దూరంగా ఉంటా' - parineeti chopra

వయసు దాచుకోవాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా. అలాంటి సిల్లీ విషయాలకు తాను దూరంగా ఉంటానని చెబుతోందీ భామ.

పరిణీతి చోప్రా

By

Published : Oct 23, 2019, 10:16 AM IST

అమ్మాయిల వయసు అడగకూడదంటారు చాలామంది. ఒక వేళ అడిగినా.. అంత సులభంగా చెప్పేందుకు వాళ్లు ఆసక్తి చూపించరు. అందులోనూ కథానాయికలైతే తమ వయసు కంటే తక్కువే చెబుతుంటారు. ఈ పద్ధతి తనకు అస్సలు నచ్చదంటోంది బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా.

"వయసు విషయంలో దాచుకోవాల్సిన అవసరం ఏముంది? అది ఓ అంకె మాత్రమే. ఈ భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నామో సూచిస్తుందంతే. వయసు చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను ఇలాంటి సిల్లీ విషయాలకు దూరంగా ఉంటా" -పరిణీతి చోప్రా, బాలీవుడ్ హీరోయిన్.

పరిణీతి చోప్రా

మంగళవారం 31వ పుట్టినరోజు జరుపుకుంది పరిణీతి.

"ప్రతి ఏడాది పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా ఎలా గడపాలో ఆలోచించేదాన్ని. కానీ ఈసారి నా ఆలోచన తీరు మార్చుకున్నాను. నేను ఎవర్ని? ఈ భూమి మీదకు ఎందుకు వచ్చా. ఇప్పటి వరకూ నేను ఏం సాధించా? భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలి? ఇలాంటి విషయాల గురించి ఆలోచించా" - పరిణీతి చోప్రా, బాలీవుడ్​ హీరోయిన్.

వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది పరిణీతి. సందీప్ ఔర్ పింకీ ఫరార్, భజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, ద గర్ల ఆన్ ద ట్రైన్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు సైనా నెహ్వాల్ బయోపిక్​లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇదీ చదవండి: అమ్మే నా ధైర్యం: అక్షరా రెడ్డి

ABOUT THE AUTHOR

...view details