ETV Bharat / sitara

అమ్మే నా ధైర్యం: అక్షరా రెడ్డి

అక్షరా రెడ్డి.. అందం.. ఆత్వవిశ్వాసం.. మనోధైర్యం.. సమయస్ఫూర్తి.. ఇవే ఆయుధాలుగా అంతర్జాతీయ స్థాయి అందాల పోటీల్లో కీరిటం గెలుచుకుంది. అమ్మే తనకు ఆదర్శమని చెబుతున్న తెలుగమ్మాయి అక్షరా రెడ్డి గురించి ప్రత్యేక ముఖాముఖి.

అక్షర రెడ్డి
author img

By

Published : Oct 23, 2019, 8:31 AM IST

అందాల పోటీల్లో అందమొక్కటే ఉంటే సరిపోదు.. సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యం. 22 దేశాల యువతులతో పోటీపడి కిరీటాన్ని అందుకున్న తెలుగమ్మాయి అక్షరా రెడ్డి.. తను ఇక్కడి వరకు రావడానికి గల కారణాల పంచుకుందిలా..

మన దేశం తరఫున ఈనెల 18న దుబాయ్‌లోని ఫ్యాషన్‌ రన్‌వే ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ వరల్డ్‌ పోటీలు జరిగాయి. ఇందులో నేను టైటిల్‌ను గెలుచుకున్నా.22 దేశాల నుంచి వచ్చిన అందమైన, ప్రతిభావంతులైన యువతులతో పోటీపడి కిరీటాన్ని అందుకున్నా. నిర్వాహకులు అడిగిన చివరి ప్రశ్నకు సమాధానంగా నా మాటలో అమ్మ నిలిచింది. ఆమె గౌరీ సుధాకర్‌ రెడ్డి. ‘ఎవరూ లేని ఎడారికి వెళ్లే అవకాశం వస్తే, నీతో ఎవరిని తీసుకెళతావు’ అని అడిగారు. అమ్మ అని జవాబిచ్చా. ఎందుకంటే నా ప్రపంచమే ఆమె. నేనీ రోజు ఇలా వేదికపై నిలబడటానికి కారణం తనే. ఆమెను సంతోషపెట్టడం నా బాధ్యత. తను నా పక్కన ఉంటే నాకు వేరే ఏదీ అవసరం ఉండదు’ అని చెప్పా. ఈ సమాధానం నన్ను విజేతగా నిలబెట్టింది. అంత పెద్ద వేదికపై తొణక్కుండా సమాధానం చెప్పగల ధైర్యాన్ని ఆమె నాలో నింపింది. ఈ గెలుపు వెనుక అమ్మ ఉంది. ఒత్తిడిలెన్నెదురైనా... నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ... ముందడుగు వేయించింది.

ఇబ్బందులెన్నెదురైనా..

నాన్న సుధాకర్‌ రెడ్డితో పెళ్లై అమ్మ చెన్నై వచ్చింది. నేను, అన్నయ్య శ్రవణ్‌రెడ్డి పుట్టింది అక్కడే. చిన్నప్పటి నుంచి వీళ్లే నా ప్రపంచం. సంతోషంగా కాలం గడుస్తున్న సమయంలో మా జీవితాల్లో పెద్ద కుదుపు. నాకు 11 ఏళ్లప్పుడు నాన్న గుండెనొప్పితో చనిపోయారు. ఒక్కసారిగా కాలం ఆగిపోయినట్లనిపించింది. అమ్మ, అన్నయ్య, నేను ఒంటరివాళ్లమయ్యాం. మా బాధ్యతలను అమ్మ తీసుకుంది. కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ, మరోవైపు మా చదువులపై శ్రద్ధ పెట్టింది. బాల్యం నుంచి నాకు మోడలింగ్‌ అంటే ఇష్టమని తెలిసి అంగీకరించింది. మనసుకు నచ్చింది చేయమని చెబుతుంది. నియమ, నిబద్ధతగా లక్ష్యాన్ని సాధించడానికి క్రమశిక్షణ అవసరమనేది. నాన్న లేకపోవడంతో అమ్మ చాలా ఇబ్బందులుపడింది. మా ముందుకు మాత్రం సమస్యలను తెచ్చేది కాదు. చెన్నైలో ఇంటర్‌ చదివి, సైకాలజీ జార్జియాలో పూర్తిచేశా.

special interview with akshara reddy
అమ్మతో అక్షరా

అర్హత సాధించా..

ఇంటర్‌లోనే మోడలింగ్‌ లోకి అడుగు పెట్టా. ఇప్పటివరకు 150కి పైగా ర్యాంప్‌వాక్‌లు చేశా. అప్పుడే ‘మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ ఇండియా’ పోటీలకు హాజరయ్యే అవకాశాన్ని పొందా. ఇందులో దాదాపు 40 మందికి పైగా పోటీ పడగా, తమిళనాడు నుంచి ఎంపికై, భారతదేశం తరఫున ‘మిస్‌ సూపర్‌ గ్లోబ్‌ వరల్‌’్డ పోటీలకు అర్హత సాధించా. ఏడు నెలలపాటు దీని కోసం కష్టపడ్డా. డైటింగ్‌, వ్యాయామాలతో ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నించా. దుబాయ్‌లోని మారియట్‌లో ఈనెల 18న చివరి పోటీలు జరిగాయి. ఇందుకోసం రెండు వారాలకు ముందుగానే అక్కడకు వెళ్లా. అమ్మ అనారోగ్యంగా ఉండటంతో, ఈసారి ఒంటరిగానే పోటీల్లో పాల్గొన్నా.

అందరూ పొడవే..

నా ఎత్తు అయిదడుగుల ఏడంగుళాలు. అక్కడికి వచ్చిన విదేశీ అమ్మాయిలందరూ ఆరు నుంచి ఆరున్నర అడుగులున్నారు. వాళ్లని చూసి, ఈ పోటీలో గెలుపు అసాధ్యమనుకున్నా. అందులోనూ దక్షిణభారతదేశం నుంచి వచ్చినవారంటే.. ఏముందిలే అన్నట్లుగా చూస్తారు. అక్కడికి అమ్మ రాలేకపోయినా... ఫోన్‌లో నాకు నమ్మకాన్ని కలిగిస్తూనే ఉంది. మనోనిబ్బరం ముఖ్యమని చెప్పేది. చివరి పోటీలకు ముందుగా ‘మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్‌’, ‘మిస్‌ బ్యూటిఫుల్‌ గ్లోయింగ్‌ స్కిన్‌’గా ఎంపికయ్యా. దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

ఒత్తిడిగా..

విజేతగా నన్ను ప్రకటించినప్పుడు ఎదురుగా అమ్మ లేకపోవడంతో ఏడుపొచ్చింది. అంతలోనే ఆడిటోరియమంతా ఇండియా... ఇండియా అంటూ చప్పట్లు కొడుతుంటే... గర్వంగా అనిపించింది. మన దేశానికి ప్రతినిధిగా పాల్గొని గెలిచానంటే సంతోషంగా ఉంది. ఒంటరిగా ఇక్కడ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. చాలా ఒత్తిడికి గురయ్యా. అవన్నీ ఇప్పుడు మర్చిపోయేంత ఆనందాన్ని అనుభవిస్తున్నా. అమ్మకు ఈ కిరీటాన్ని కానుకగా ఇచ్చా. అమ్మ, అన్నయ్య అందించిన ప్రేమ, నా స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారం, నన్నింత అందంగా తీర్చిదిద్దడానికి నా దుస్తులను డిజైన్‌ చేసిన శ్వేత గంగాధరన్‌ తదితరులకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నా.

స్ఫూర్తిగా..

కష్టాలెన్నెదురైనా ధైర్యంగా ముందడుగు వేసిన జయలలిత మేడం నాకు స్ఫూర్తి. మోడలింగ్‌లో సుస్మితాసేన్‌, ఐశ్వర్యారాయ్‌ నాకు గురువులు. సినిమాలు ఎక్కువగా చూస్తా. తిండి లేకపోయినా చాకొలెట్లు మాత్రం కావాలి. ఈ భూమిపై జంతువులు కూడా ఆరోగ్యంగా, సౌకర్యంగా నివసించడానికి అవసరమైన కృషి చేస్తా. దేవుడు ఏదైనా కోరుకోమంటే మాత్రం మనుషుల్లో అసూయ, ద్వేషం లేకుండా చేయమంటా. చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా, బాలికావిద్య వంటి అంశాలపై భవిష్యత్తులో కృషి చేస్తా. స్టార్‌ విజయ్‌ టీవీలో విల్లా టు విలేజ్‌ కార్యక్రమంలో ‘మిస్‌ సౌత్‌ ఇండియా క్వీన్‌’ కిరీటాన్ని అందుకున్నా. కన్నడ, తమిళచిత్రాల్లో నటించా. త్వరలో ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నా.

ఇదీ చదవండి: తెలుగుతెర డార్లింగ్​.. పాన్​ ఇండియా స్టారయ్యాడు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
Estadio Monumental de Nunez, Buenos Aires, Argentina. 22 October 2019.
1. 00:00 Various of River Plate bus moving through avenue, surrounded by supporters cheering
2. 00:25 Various of fans chanting
3. 00:44 River Plate bus leaving accompanied by supporters
La Boca, surrounding La Bombonera stadium, Buenos Aires, Argentina. 22 October 2019.
4. 00:53 River Plate bus entering Boca stadium area
5. 01:13 Pan of Boca Juniors fans waiting to enter the stadium  
6. 01:26 Boca Juniors' bus entering stadium area
7. 01:40 Various of Boca Juniors fans entering the stadium and police
SOURCE: SNTV
DURATION: 02:05
STORYLINE:
Supporters cheered the River Plate squad before the bus departed to Boca Juniors stadium, La Bombonera, to play Copa Libertadores decisive semi-final.
Both buses entered the Boca stadium area without troubles, protected by huge security team.
A year ago, Boca's bus was attacked by River fans before the match and it caused the suspension of the Copa Libertadores final and a second leg played in Spain.
River won the semi-final's first leg 2-0 in home soil on October 1st.
The eternal Argentine rivals meet again to decide who will play the Copa Libertadores final in Santiago de Chile next month.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.