ETV Bharat / sitara

తెలుగుతెర డార్లింగ్​.. పాన్​ ఇండియా స్టారయ్యాడు - tollywood young rebal star prabhas birthday

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ నేడు 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఆరున్నర అడుగుల ఈ స్టార్​ హీరోకు సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. డార్లింగ్​గా తనదైన స్థానం ఏర్పర్చుకున్న రెబల్​స్టార్​... తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో తనవంతు కీలకపాత్ర పోషించాడు.

తెలుగుతెర డార్లింగ్​.. పాన్​ ఇండియా స్టారయ్యాడు
author img

By

Published : Oct 23, 2019, 5:46 AM IST

"కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌..." అని చెప్పిన ఓ ఆరడుగుల అందగాడు... డార్లింగ్​గా ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. భళిరా భళీ... అంటూ 'బాహుబలి' సిరీస్​తో బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డుల్ని లిఖించాడు. దక్షిణాది చిత్రరంగం గ్రాఫ్​ పెంచడంలో తనదైన కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం బహుభాషల్లో సందడి చేసే పాన్​ ఇండియా స్టార్​ అయ్యాడు. అంతేకాకుండా తన నటనకు ఖండాంతరాల్లోనూ గుర్తింపు తెచుకున్నాడు. అతడే ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు.

డార్లింగ్‌ పదానికి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ రెబల్​స్టార్​. ముచ్చటగా మూడక్షరాలతో ప్రభాస్​ అని పిలిస్తే పలికే ఆయన... నేడు 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు.

tollywood young rebal star prabhas entered into 40th birthday
కొత్త లుక్​లో ప్రభాస్​

1979 అక్టోబరు 23న సూర్య నారాయణరాజు, శివకుమారి దంపతులకి జన్మించాడు ప్రభాస్‌. ఆయన సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు. ప్రముఖ కథానాయకుడు కృష్ణంరాజు ప్రభాస్‌కి పెదనాన్న. ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదట ప్రభాస్‌. స్వతాహాగా సిగ్గరి అయిన ఆయన... వెండితెరపై అడుగుపెట్టి దాదాపు 19 సినిమాలకు పైగా నటించాడు

ఈశ్వర్​తో తొలిపరిచయం...

2002లో జయంత్​ సీ పరాంజీ దర్శకత్వలో వచ్చిన 'ఈశ్వర్'​ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు ప్రభాస్​. ఆయనకు జోడీగా అలనాటి అందాల తార మంజుల కూతురు శ్రీదేవి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2003లో 'రాఘవేంద్ర', 2004లో 'వర్షం', 'అడవిరాముడు' చిత్రాల్లో ప్రేమికుడిగా మంచి ముద్ర వేశాడు. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చక్రం' సినిమా ప్రభాస్‌ నటనను మరో స్థాయికి తీసుకెళ్లింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఛత్రపతితో స్టార్​ ఇమేజ్​...

2005లో వచ్చిన 'ఛత్రపతి' సినిమా ప్రభాస్​కు మరింత స్టార్​ ఇమేజ్​ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2006లో ప్రభుదేవా దర్శకత్వంలో 'పౌర్ణమి' చిత్రంలో వైవిద్యభరితమైన పాత్ర పోషించాడు. ఇది ఆశించిన స్థాయిలో రాణించక పోయినా ప్రభాస్‌కి మాత్రం హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2007లో 'యోగి', 'మున్నా', 2008లో 'బుజ్జిగాడు', 2009లో 'బిల్లా', 'ఏక్‌ నిరంజన్​' చిత్రాలు ప్రభాస్‌ కెరీర్‌ని ముందుకు తీసుకెళ్లాయి. 'బిల్లా' చిత్రంలో తన పెదనాన్న, రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజుతో వెండితెర పంచుకున్నాడు.

'డార్లింగ్‌'తో అందరి మన్ననలు..

2010లో 'డార్లింగ్‌' సినిమా ప్రభాస్‌ని రొమాంటిక్‌ హీరోగా ముద్ర వేసింది. తర్వాత 2011లో వచ్చిన 'మిస్టర్​ ఫర్​ఫెక్ట్​', 2012లో 'రెబెల్‌', 2013లో 'మిర్చి' సినిమాలు ప్రభాస్‌ కెరీర్‌ గ్రాఫ్​ను మరింత పెంచేశాయి. 2015, 2017లో విడుదలైన బాహుబలి సిరీస్​లోని రెండు భాగాలు...​ ప్రభాస్‌ కెరీర్‌ని ఎవరెస్ట్‌ అంత ఎత్తుకి తీసుకువెళ్లాయి.

ఈ సినిమా కోట్లాది రూపాయలు కొల్లగొట్టడమే కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. ఈ సినిమా తాజాగా ఇంగ్లాండ్​లోని ప్రముఖ థియేటర్​ రాయల్​ ఆల్బర్ట్​లో ప్రదర్శితమవడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో అభిమానులను అలరించింది.

'మేడమ్‌ టుస్సాడ్స్​'లో ప్రభాస్‌ శిల్పం

దక్షిణాది తారలెవరికీ దక్కని తొలి అవకాశం ప్రభాస్‌కి దక్కింది. మేడం టుస్సాడ్స్​లో ఆయన మైనపు శిల్పం కొలువు తీరింది. నంది అవార్డులు, ఫిలిం ఫేర్‌ అవార్డులు సైతం అందుకున్న ప్రభాస్‌... ఇటీవల 'సాహో' చిత్రం ద్వారా మళ్ళీ ప్రేక్షకులను పలకరించాడు.

పెళ్లి గురించీ చర్చే...

టాలీవుడ్‌ ఆన్‌ స్క్రీన్‌ పాపులర్ జోడీ ప్రభాస్‌, అనుష్క ప్రేమలో ఉన్నారని ఎంతో ప్రచారం జరిగింది. వీరిద్దరి పెళ్లి జరగబోతోందని వార్తలు వచ్చాయి. ఈ వదంతులపై ప్రభాస్‌ను స్పందిస్తూ.. అనుష్క తనకు మంచి స్నేహితురాలని సమాధానం ఇచ్చాడు. అప్పట్నుంచి ఈ బ్యాచిలర్​ హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

విదేశాల్లో వేడుకలు...

'సాహో' తర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. 'జాన్‌' అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం విదేశాల్లో విహారయాత్ర చేస్తున్నాడీ హీరో. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు కూడా అక్కడే జరుపుకోనున్నారట. ఆయన టూర్‌ నుంచి వచ్చిన తర్వాత తిరిగి చిత్రీకరణ ప్రారంభం కానుంది. గోపీకృష్ణ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
2000
NEW YORK_  The famous Radio City Rockettes kick off the holiday show season with a preview number in midtown.  
2100
NEW YORK_ Da'Vine Joy Randolph on learning from Eddie Murphy on 'Dolemite Is My Name.'
NEW YORK_ Rising recording artist Jessie Reyez on new music and her spiritual connection.
WEDNESDAY 23 OCTOBER
TBC
NEW YORK_ A special screening of Disney's remake, "Lady and the Tramp," attended by the stars Tessa Thompson, Justin Theroux and some furry friends.
0700
WASHINGTON_ Cynthia Erivo premieres Harriet Tubman biopic 'Harriet' at the National Museum of African American History.
NEW YORK_ Desmond Child on breaking the glass ceiling as an openly gay record producer.
1300
LONDON_ Meghan Markle should return to acting, according to Wendell Pierce.
1500
LONDON_ 'Jack Ryan' is back in action and so is Wendell Pierce for series 2.
2100
KARACHI_ Opening day of Pakistan fashion week including shows from Alkaram Studio and Ayesha Farooq
2200
NASHVILLE_ Country singer Craig Morgan talks about his song inspired after death of his son.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ Location, location, location for 'Jack Ryan' stars John Krasinski and Michael Kelly.
NEW YORK_ Anupam Kher says the rest of the world underestimates Indian cinema.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ At 'Current War' premiere, cast happy film survived Weinstein scandal.
LONDON_ Rock icon Noel Gallagher honored for songwriting in London.
N/A_ Final trailer for 'Star Wars: The Rise of Skywalker' released.
LOS ANGELES_ Bebe Rexha says her 'Maleficent 2' anthem was inspired by Serena Williams.
LOS ANGELES_ For futuristic series 'See,' sighted actors went through a blindness bootcamp.
SEOUL_ Arnold Schwarzenegger, Linda Hamilton walk black carpet for latest Terminator instalment in Seoul.
LONDON_ They're both back. Arnold Schwarzenegger and Linda Hamilton chat 'Terminator: Dark Fate.'
ROME_ Martin Scorsese shares his love for Italian cinema as 'The Irishman' premieres at the Rome Film Festival.
LOS ANGELES_ Guests including Julia Louis-Dreyfus, Jessica Alba and January Jones arrive at star-studded InStyle Awards.
LOS ANGELES_ Julia Louis-Dreyfus, Bill Hader honored at InStyle Awards.
ARCHIVE_ Judge allows Chicago suit against Jussie Smollett to proceed.
ARCHIVE_ Nicki Minaj indicates she's now a married woman.
ROME_ John Travolta discusses new psychological thriller 'The Fanatic' at Rome Film Festival.
CELEBRITY EXTRA
LONDON_ Wendell Pierce describes acting as "the study of human behavior".
NEW YORK_ Actress Lauren Lapkus is a big fan of the Japanese reality series 'Terrace House'.
LOS ANGELES_ 'Dolemite Is My Name' stars Wesley Snipes and Keegan-Michael Key talk entrepreneurship.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.