"మంచి సినిమాల్లో నటించాలనే కోరిక వల్లే నేను ఎక్కువ చిత్రాలను అంగీకరించడం లేదు" అంటోంది బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్. ఆమె అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన 'బెల్‌బాటమ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కరోనా కాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని హిందీలో విడుదలవుతున్న తొలి సినిమా ఇదే. మరో రెండు చిత్రాలతో వాణీ బిజీగా ఉంది. గతేడాది వచ్చిన 'వార్' విజయం సాధించాకే కెరీర్‌ను ఎలా నిర్మించుకుకోవాలన్న దానిపై స్పష్టత వచ్చిందని చెబుతోంది.
'అలాంటి సినిమాల్లో నటించాననే తృప్తి చాలు'
ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకునేలా కథలను ఎంపికచేసుకుంటా అంటోంది బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్. తన పాత్ర ప్రధానంగా లేకపోయినా మంచి సినిమాలో నటించాననే తృప్తి ఉంటే చాలని చెబుతోంది.
"అవకాశాలు అంత సులువుగా దక్కవు. అందుకే ప్రజల్లో గుర్తింపు దక్కేలా కథలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నాను. కథ నా పాత్ర చుట్టే తిరగకున్నా ఫర్వాలేదు కానీ, నన్ను అద్భుతమైన చిత్రాల్లో చూడాలనుకుంటున్నాను. 'బేఫికర్', 'వార్' చిత్రాల్లో నా నటనను చూసే దర్శకుడు అభిషేక్ కపూర్ తన సినిమా 'చండీగఢ్ కరే ఆషికి'లో అవకాశం ఇచ్చారు. ఏదీ అంత సులువుగా రాదు. సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూడాలనేదాన్ని నేను నమ్ముతాను" అని చెప్పింది వాణీ కపూర్. ఆమె ప్రస్తుతం 'షమ్షేరా', 'చండీగఢ్ కరే ఆషికి' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.