పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తోంది. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకోగా, చివరి షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉంది.
'వకీల్ సాబ్' సెట్స్‌లో నివేదా థామస్ - nivetha thamos cinema news
పవన్‌కల్యాణ్ 'వకీల్ సాబ్' సెట్స్‌లో నివేదా థామస్ అడుగుపెట్టింది. ఆ ఫొటోను ట్వీట్ చేసింది.
నివేదా థామస్
అయితే, మంగళవారం నివేదా థామస్ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టింది. ఆ ఫొటోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. త్వరలోనే పవన్ కూడా షూటింగ్లో పాల్గొననున్నారు.
అంజలి కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. దిల్‌రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.