సినిమాల్లోనే కాదు... వ్యవసాయంలోనూ సూపర్ హిట్టే మలయాళ సినీ రంగంలో తన ప్రతిభతో ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్నారు విజయన్ పిళ్లై. ప్రస్తుతం.. పూర్తి స్థాయి రైతుగా మారి వ్యవసాయంలో రాణిస్తున్నారు. సినిమాల్లో సూపర్ హిట్టయిన విజయన్.. సేంద్రీయ సేద్యంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.
కొల్లాం జిల్లా పశ్చిమ కల్లడలోని తన ఇంటిచుట్టూ విశాలమైన ఆవరణలో రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. ఒక్క క్యారెట్, బెండకాయ, టమోటాలే ఇక్కడ 200 సంచుల్లో పెరుగుతున్నాయి. కూరగాయల మొక్కలు, పాదులతో కొత్త శోభను సంతరించుకున్న విజయన్ నివాసం ఇప్పటికే అనేక సినిమాలకు, టీవీ సీరియళ్లకు చిత్రీకరణ ప్రాంతంగా మారిపోయింది.
ఇదీ చూడండి:ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?
ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన గ్రీన్‌హౌస్‌లో పచ్చిమిరప సాగవుతోంది. కూరగాయలతోపాటు కొన్ని పళ్ల చెట్లను సైతం విజయన్ పెంచుతున్నారు. నీటితో సాగుచేసేందుకు (హైడ్రోపోనికల్లీ) వీలుగా రూపొందించిన గది ఇక్కడ మరో ఆకర్షణ. రోజూ కేరళలోని అనేక ప్రాంతాల ప్రజలు వచ్చి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. వారందరికీ సేంద్రీయ సేద్యం గురించి వివరిస్తూ... ఆ దిశగా ఆలోచించేలా చేస్తున్నారు విజయన్ పిళ్లై.
ఇదీ చూడండి:గాంధీ 150: 'గాలోగీ' వెలుగులతో ప్రగతికి సోపానాలు