బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీపై ముంబయిలో ఎఫ్ఐఆర్ నమోదైంది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సరైన కారణం లేకుండా ముంబయి వీధుల్లో తిరగడమే ఇందుకు కారణం.
టైగర్ ష్రాఫ్, దిశా పటానీపై కేసు - లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన టైగర్ ష్రాఫ్
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీలపై ముంబయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ కారణం లేకుండా బయటకు వచ్చినందుకు కేసు పెట్టారు.

టైగర్ ష్రాఫ్, దిశా పటానీపై కేసు
ఏం జరిగింది?
ముంబయి బాంద్రాలో పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న పోలీసుల కంటికి చిక్కారు టైగర్ ష్రాఫ్, దిశా. ఇద్దరినీ విచారించగా వారు డ్రైవ్ కోసం వచ్చామని తెలిపారు. అయితే సరైన కారణం లేకుండా ఇలా బయటకు రావడం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్న పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.