తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అర్జున్ రెడ్డి' దర్శకుడి కొత్త సినిమా.. ఓటీటీలోనే 'దృశ్యం 2' - tollywood movie updates

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'ఎనిమల్', 'దృశ్యం 2', 'డర్టీ హరి', 'మదగజ', 'యువరత్న', 'ఆకాశవాణి', 'కురుప్' చిత్రాల సంగతులు ఉన్నాయి. అవేంటో చూసేయండి.

movie updates from animal, drishyam 2, yuvaratna, dirty hari, aakshavaani, kurup, madagaja
'అర్జున్ రెడ్డి' దర్శకుడి కొత్త సినిమా.. టీజర్​తో 'దృశ్యం 2'

By

Published : Jan 1, 2021, 3:11 PM IST

Updated : Jan 1, 2021, 3:40 PM IST

*'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. తన తర్వాతి సినిమాను ప్రకటించారు. బాలీవుడ్​ హీరో రణ్​బీర్ కపూర్​తో 'ఎనిమల్' చిత్రాన్ని తీస్తున్నట్లు తెలిపారు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఇందులో అనిల్ కపూర్, పరిణితి చోప్రా, బాబీ దేఓల్ ఇతర పాత్రలు పోషించనున్నారు.

*మోహన్​లాల్ 'దృశ్యం 2' టీజర్.. న్యూయర్​ కానుకగా విడుదలైంది. సినిమాను త్వరలో అమెజాన్ ప్రైమ్ వేదికగా తీసుకురానున్నారు. ఇందులో మీనా కథానాయిక.

*ఇటీవల ఓటీటీలో విడుదలైన 'డర్టీ హరి' సినిమాను ఈనెల 8న తిరిగి థియేటర్లలో రిలీజ్​ చేయనున్నారు. ఎమ్.ఎస్ రాజు దర్శకత్వం వహించారు.

*కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ 'యువరత్న' చిత్రాన్ని ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని న్యూయర్​ సందర్భంగా ప్రకటించారు.

*జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఫాదర్ చిట్టి ఉమ కార్తిక్' టీజర్​ విడుదలైంది. ఆద్యంతం నవ్విస్తూ చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

*దుల్కర్ సల్మాన్, శోభిత ధూళిపాళ్ల జంటగా నటిస్తున్న మలయాళ సినిమా 'కురుప్'. అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

*కన్నడ హీరో శ్రీమురళి 'మదగజ' టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ ఎంటర్​టైనర్​ కథతో దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు.

*'ఆకాశవాణి' నుంచి 'దొర' లుక్​లో వినయ్ వర్మ ఆకట్టుకుంటున్నారు. దీనితో పాటే విజయ్ ఆంటోని 'విజయ్ రాఘవన్' టీజర్.. శనివారం విడుదల కానుంది.

పునీత్​ రాజ్​కుమార్ యువరత్న సినిమా రిలీజ్ డేట్
డర్టీ హరి సినిమా
దుల్కర్ సల్మాన్, శోభిత ధూలిపాళ్ల 'కురుప్' సినిమా
విజయ్ ఆంటోని విజయ్ రాఘవన్ సినిమా
ఆకాశవాణి సినిమా కొత్త పోస్టర్
Last Updated : Jan 1, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details