తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్షయ్​ 'మిషన్​ మంగళ్​'పై ఇస్రో ట్వీట్

బాలీవుడ్‌లో ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'మిష‌న్ మంగ‌ళ్‌.' జగన్​ శక్తి దర్శకత్వంలో అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్​​ను విడుదల చేయగా.. ఇస్రో ఆ వీడియోపై ట్వీట్​ చేసింది.

అక్షయ్​ 'మిషన్​ మంగళ్​'పై ఇస్రో ట్వీట్

By

Published : Jul 11, 2019, 9:09 PM IST

బాలీవుడ్‌లో హీరో అక్షయ్​ కుమార్​, దర్శకుడు జగన్​ శక్తి కాంబినేషన్​లో 'మిష‌న్ మంగ‌ళ్‌' సినిమా రూపొందుతోంది. తాప్సీ, విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్​​ను విడుదల చేసింది చిత్ర బృందం. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మంగళవారం ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేయగా... దానిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ట్వీట్​ చేసింది.

" ఒక దేశం, ఒక కల, ఒక చరిత్ర.. భారతదేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్‌యాన్‌. ఈ శాటిలైట్​ కథ ఆధారంగా రాబోతున్న సినిమా టీజర్‌ ఇదిగో"’అని టీజ‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు అక్ష‌య్.

ఈ చిత్ర టీజ‌ర్‌పై అభిమానులు, ప్రముఖులు ప్ర‌శంస‌లు కురిపించగా... తాజాగా ఇస్రో కూడా స్పందించింది.

"ఒక దేశం క‌ల‌ ఇది. అంతరిక్షంలోనూ తిరుగులేని శక్తిగా భారత్​ త‌యార‌వుతుంది. మరి కొద్ది రోజుల్లో ఇస్రో ఖాతాలో మ‌రో మైలురాయి చేరనుంది. చంద్ర‌యాన్-2తో స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తాం"
--ఇస్రో ట్వీట్​.

అక్షయ్​ ట్వీట్​పై ఇస్రో సమాధానం

భారత అంతరిక్ష సంస్థ ట్వీట్‌పై స్పందించిన అక్ష‌య్.. " ఆకాశానికి హ‌ద్దులు లేవు. చంద్ర‌యాన్-2 బృందానికి నా శుభాకాంక్ష‌లు" అని పేర్కొన్నాడు.
ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ దీనిలో కీలకాంశం. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అయింది. ఆగ‌స్ట్ 15న విడుదలకు సిద్ధమౌతోంది.

ఇది చదవండి: నిజానికి ఒకటే.. అబద్దానికి ఎన్నో ముఖాలు

ABOUT THE AUTHOR

...view details