'బాహుబలి', 'సాహో' చిత్రాలతో భారతీయ చలన చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న కథానాయకుడు ప్రభాస్. 2019 ఏడాదికిగానూ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అత్యంత ప్రభావవంతమైన టాప్-100 జాబితాను వారి ఆదాయ ఆర్జనతో సహా విడుదల చేసింది. ఈ జాబితాలో 'డార్లింగ్' ప్రభాస్(రూ.35కోట్లు) 44వ స్థానంలో నిలిచాడు. గతేడాది ఈ హీరో పేరు టాప్-100లోనూ లేకపోవడం గమనార్హం. ఇక గతేడాది 33వ స్థానంలో ఉన్న మహేశ్‌బాబు(రూ.35కోట్లు) ఈసారి 54వ స్థానానికి పరిమితమయ్యాడు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్(రూ.21.5కోట్లు) తొలిసారి 77వ స్థానంలో నిలిచాడు.
ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ(రూ.252.72కోట్లు) నిలిచాడు. రూ.293.25కోట్లతో అక్షయ్‌కుమార్ రెండో స్థానాన్ని దక్కించుకోగా, గతేడాది మొదటి స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్(రూ.229.5కోట్లు) మూడో స్థానానికి పడిపోయాడు.
ఫోర్బ్స్-100
1.కోహ్లీ
2.అక్షయ్ కుమార్
3.సల్మాన్ ఖాన్
4. అమితాబ్ బచ్చన్
5.ధోనీ
6.షారుఖ్ ఖాన్
7.రణ్‌వీర్‌సింగ్
8.ఆలియా భట్
9.సచిన్
10.దీపికా పదుకొణె
12.అజయ్ దేవగణ్
13.రజనీకాంత్
14.ప్రియాంక చోప్రా
15.ఆమిర్ ఖాన్
16. ఏ.ఆర్. రెహమాన్
18.హృతిక్‌రోషన్
19.అమిత్ త్రివేది
20.విశాల్- శేఖర్
21.అనుష్క శర్మ
23.కత్రినా కైఫ్
25. వరణ్ ధావన్