ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్ కెమెరా పట్టుకోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! 'ఆర్‌ఆర్‌ఆర్' లాంటి క్రేజీ ప్రాజెక్టులో నటిస్తూ ఇలా కెమెరాతో ప్రయాణిస్తుంటే అలానే ఉంటుంది. అసలు చెర్రీ ఎందుకు కెమెరాతో ఉన్నాడంటే.. వన్యప్రాణి సంరక్షణకు ప్రపంచ స్థాయిలో నిధుల సమీకరణ జరుగుతుంది. ఇప్పుడు చరణ్ కూడా భాగస్వామి కాబోతున్నాడు.
ఇందుకు తగ్గట్లుగా వన్యప్రాణుల మీద ప్రేమతో తన ఇంట్లో 'వైల్డెస్ట్ డ్రీమ్స్' పేరుతో ఓ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. సింహాలు, పులులు, జిరాఫీలు తదితర జంతువుల ఫొటోలను ఇందులో పొందుపరిచారు. వాటిని చెర్రీనే తన కెమెరాలో బంధించాడు. ఫొటోగ్రాఫర్లు షాజ్ జంగ్, ఇజాజ్ ఖాన్, ఇషేతా సాల్ గావ్ చరణ్‌కు సహాయకులుగా ఉన్నారు. ఆ సమయంలో. వీటితో ప్రజల్ని చైతన్య పరచడమే వాళ్ల ఉద్దేశ్యం.
ప్రకృతిని కాపాడుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనే స్వచ్ఛంధ సంస్థ గత 60 ఏళ్ల కింద ఈ కార్యక్రమానికి నడుంబిగించింది. అంతర్జాతీయంగా 5 మిలియన్ల సభ్యులతో 100దేశాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. "నేల తల్లిని, ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. అది మన చేతుల్లోనే ఉంది. నేను కెమెరాతో ప్రయాణించడానికి కారణం ఇదే" అని తెలిపాడీ మెగాహీరో.